మోహన్ బాబు అంటే అందరికీ తెలుసు. కానీ  ఆయన అసలు పేరు భక్త వత్సల నాయుడు. మార్చి 19 ఆయన పుట్టినరోజు. రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చి సినీ రంగంలో రాటుదేలి ఈ హోదాకు చేరుకున్న మోహన్ బాబు నిజంగా గ్రేట్ అనాలి. ఆయనకు ఏ విధమైన బ్యాక్ గ్రౌండ్ లేదు. కేవలం తన ప్రతిభతోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు.

 

అటువంటి మోహన్ బాబు 1975లో స్వర్గం‍‍ నరకం మూవీ ద్వారా ఇద్దరు హీరోలలో ఒకరిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆయన్ని హీరోగా పరిచయం చేసింది దర్శకరత్న దాసరి నారాయణరావు. అంతకు ముందు మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొన్ని సిన్మాలకు  పనిచేశారు. ఆయన కన్నవారి కలలు, అల్లూరి సీతారామ రాజు వంటి మూవీస్ లో చిన్న పాత్రలు వేశారు.

 

ఇక మోహన్ బాబు తెలుగు సినీ రంగంలో ఎందరో డైరెక్టర్ల వద్ద పనిచేసారు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. మోహన్ బాబు హీరోగానే కాదు, విలన్  గా, కమెడియన్ గా, క్యారక్టర్ యాక్టర్ గా, నిర్మాతగా ఎన్నో భూమికలు పోషించారు.

 

తెలుగులో టాప్ డైరెక్టర్లు అయిన దాసరి, కే రాఘవేంద్రరావు, బాపు, కోదండరామి రెడ్డి, బి గోపాల్ వంటి వారందరి దర్శకత్వంలో  చేసిన మోహన్ బాబు కళా తపస్వి విశ్వనాధ్ డైరెక్షన్లో మాత్రం చేయలేదంటే విశేషంగానే చెప్పుకోవాలి. 

 

ఎందరో నటీనటులు విశ్వనాధ్ వద్ద పనిచేశారు. అటువంటిది అధ్బుతమైన ప్రతిభ కలిగిన మోహన్ బాబు ఆ మహాంభావుడి డైరెక్షన్లో చేయలేదంటే అది ఒక వెలితి గానే చూడాలి. ఏది ఏమైనా మోహన్ బాబు నటన, ఆయన డైలాగ్ డెలివరీ ఆయనకే సొంతమని చెప్పాలి. ఆయన మరిన్ని వైవిద్యమైన పాత్రలు ధరించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: