మనం ఖడ్గం సినిమా చూసే ఉంటాం.. అందులో రవి తేజ ఒక్క ఛాన్స్.. ఒకేఒక ఛాన్స్ అని తెగ సతాయిస్తాడు కదా! గుర్తు ఉంది కదా? సినిమాలు వాళ్ళు అంటే అంతే.. ఒక్క ఛాన్స్ కోసం ఎంతో ఎదురు చూస్తారు.. ఒక ఛాన్స్ ఇస్తే టాలెంట్ నిరూపించుకుంటాం అని అంటారు.. అలానే ఒక్క ఛాన్స్ తో వారి టాలెంట్ నిరూపించుకొని తారాస్థాయికి చేరిన వారు ఎంతోమంది ఉన్నారు.. కొందరు పాతాళానికి పడిపోయారు. 

 

ఇకపోతే ఒక్క ఛాన్స్ తో స్టార్ డాం తెచ్చుకున్న వారు చాలా అరుదు. అలాంటి అరుదైన వారిలో రికార్డు సృష్టించినవారిలో వివి వినాయక్ ఒకరు. చెప్పులు అరిగేలా సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరిగాడు.. ఎన్నో అద్భుతమైన కథలు రాశాడు.. కానీ ఏ స్టార్ వినడానికి ఆసక్తి కనబరచలేదు.. కానీ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 

 

ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడింది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయంలో చిత్రీకరణ పూర్తై ఆ యూనిట్ బయలుదేరుతున్న సమయంలో నల్లమల్లపు శ్రీనివాస్ వినాయక్ ను అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం చేశారు. ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఉంది అని చెప్పగా అప్పటికే ఎంతోమంది ఎన్టీఆర్ ను కథ చెప్తం అని సతాయించగా ఇంకా వినాయక్ కూడా అలానే అని హైదరాబాద్ వచ్చాక కలవమని చెప్పి పంపేశారు

 

హైదరాబాద్ వచ్చాక బాగా సతాయించడంతో ఓసారి కథ వినాలి అని పిలిపించాడు. అయితే మొత్తం కథ చెప్పకు ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పు అని అన్న ఎన్టీఆర్ చివరికి కథ అంత విని అద్భుతం అని చెప్పాడు.. ఆతరవాత ఆ కథ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత కోడలి నాని ఆ కథ వొద్దు అనడంతో మాస్ సినిమా చెయ్యడం కావాలి అనడంతో వారం రోజుల్లో కథ రెడీ చేసుకొని వచ్చి సినిమా చేశాడు. ఆ సినిమానే ఆది.. అప్పట్లో సూపర్ హిట్ చిత్రం ఇదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: