మనసు కవి ఆత్రేయ ఒక పాటలో అంటారు. వయసు మొండిది. అది కట్టుబాట్లు, సర్దుబాట్లు వంటి రాజీ మాటలు వినదు అని. దాన్ని బంధించడం ఎవరి తరం కాదని అంటారు. వయసు తిరుగుబాటు కన్నె మనసుకే తెలుసు. అది ఎదిరించాలనుకుంటే ఉప్పెన అవుతుంది. తప్పూ ఒప్పూ చూడకుండా ముందుకు సాగుతుంది.

 

అంతటి అందం సొంతం కాబట్టే ఉప్పెన మూవీలో ఆ అమ్మడు ఎంపిక అయింది. ఆ మూవీలో క్రుతి శెట్టి అనే కొత్తందం నటిస్తోంది. కన్నడ కస్తూరి అయిన ఈ ముద్దు గుమ్మ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పక్కన జోడీ కడుతోంది. ఫస్ట్ మూవీ రిలీజ్ కాలేదు కానీ క్రుతి అందం ఉప్పెనలా దూసుకువచ్చింది. ఈ మూవీ స్టిల్స్ చూసిన వారంతా క్రుతి  అదరగొట్టే ఫిగర్ అంటున్నారు.

 

ఉప్పెన మూవీకి నిర్మాతగా ఉన్న సుకుమార్హీరోయిన్ కి రెండో చాన్స్ కూడా తన శిష్యుడు మూవీలో ఇప్పించేశారు. నిఖిల్ హీరోగా వస్తున్న కొత్త మూవీలో క్రుతి  హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిందంటే ఆమె ఫ్యూచర్ ఏంటో అర్ధమైపోతోందిగా. ఇక క్రుతి ఈ మూవీలో నటనలో కూడా మంచి మార్కులు సాధించిందని అంటున్నారు.

 

ఎటూ బ్యాక్ బోన్ గా డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు కాబట్టి క్రుతికి టాలీవుడ్ ఇండస్ట్రీ బ్రహ్మరధం పట్టడం ఖాయమని అంటున్నారు. ఇక క్రుతి తోనే సుకుమార్ పెద్ద స్టార్ల పక్కన డ్యాన్సులు చేయించగలరని అంటున్నారు. మొదటి సినిమా రిలీజ్ అయితే ఈ అందాల ఉప్పెనను తట్టుకోగలమా అని టాలీవుడ్లో మిగిలిన అందాల భామలు హడలుతున్నారుట. 

 

ఏది ఏమైనా కొత్తందం ఎపుడూ వెండి తెరను నూతన  వెలుగులతో పండిస్తుంది. హీరోలు, డైరెక్టర్లు కూడా అదే కోరుకుంటారు. ఆడియన్స్ కూడా కొత్త అంటూనే ఉంటారు. కాబట్టి ఈ అప్ కమింగ్ హీరోయిన్ క్రుతి  మిగిలిన స్టార్ హీరోయిన్లకు, పొగరు సొగసుగత్తెలకు గట్టి పోటీ ఇచ్చేలా ఉందని అంటున్నారు. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: