తెలుగు లో ఈ మద్య తన అద్భుతమైన గాత్రంతో కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలు దోచేస్తున్నాడు సింగర్ సిద్ శ్రీరామ్.  మలోని మాధుర్యాన్ని, విరహ వేధనకు ప్రాణం పోసి పాడతాడా? అనేట్టుగా, గుండెకు హత్తుకునేలా చేస్తాడు ఈ యువ గాయకుడు. ఈయన పాట పాడాడంటే చాలు ఆ సినిమాకు ఎక్కడా లేని హైప్ వస్తుంది. 'ఉండిపోరాదే ..' .. 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే .. ' .. 'సామజ వర గమన' .. 'నీలి నీలి ఆకాశం .. ' వంటి పాటలు ఆయన స్థాయిని పెంచుతూ వచ్చాయి. సిద్ శ్రీరామ్ గాత్రంలో ప్రత్యేకత ఆయనకి యూత్ లో అభిమానుల సంఖ్యను పెంచుతూ వస్తోంది.

 

ఆ సినిమాల్లో సక్సెస్ శాతం ఎక్కువ ఉండటం ఆయనకి కలిసొచ్చే అంశాలుగా మారిపోయాయి. ఇక సౌత్ ఇండియాలో స్టార్ సింగర్స్ అంటే అందరికీ ఎస్పీబాల సుబ్రమణ్యం, యేసుదాస్, సుశీలా, జానకమ్మ లు గుర్తుకు వస్తుంటారు. వీరు  సీనియర్స్ కావడంతో యువ సింగర్స్ ఎంతో మంది తమ ప్రతిభను చాటారు. మధ్యలో కార్తిక్, చిన్మయి, శ్రేయా ఘోషాల్ వంటి వారు వచ్చారు.  ప్రస్తుతం సినీ పరివ్రమలో వివిధ బాషల్లో పాడుతూ వీరి బిజీగానే ఉన్నారు.  అయితే ఈ మద్య సిద్ శ్రీరామ్ తన గాత్రంతో మాయ చేస్తున్నాడు.

 

ప్రేక్షకులు మనసు దోచేస్తూ.. యూట్యూబ్ సంచలనాలు సృష్టిస్తున్న ఈ సింగర్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.   అసలు డబ్బులు కూడా ఇవ్వకుండా పాడించుకుంటారని, సాధారణ సింగర్స్‌కు ఐదు వేలు, పది వేలు ఇస్తారనే వదంతులున్నాయి. అయితే స్టార్ స్టేటస్‌ అనుభవించే సింగర్స్ లక్ష వరకు ఇస్తారని తెలుస్తోంది. ఇక ఈ యూవ గాయకుడు ఒక్కో పాటకు ఏకంగా ఐదు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: