తెలుగు హీరోలు పక్క మార్కెట్ లోకి వెళ్లాలంటే చాలా ఆలోచిస్తారు. గుర్తింపు వచ్చినా సరే పక్క భాషల్లో సినిమాలకు తటపటాయిస్తుంటారు. కనీ మళయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం ఇలాంటివేం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనకు ఎంతుంది అనే దానికంటే.. ఎంత సంపాదించుకోవాలి అనే లెక్కల్లోనే ప్రయాణిస్తున్నాడు. తెలుగులో స్ట్రయిట్ మూవీకి కమిట్ అయ్యాడు. 

 

మమ్ముట్టి వారసుడిగా కెరీర్ స్టార్ చేసిన దుల్కర్ సల్మాన్ మళయాళీ పరిశ్రమకే పరిమితం కావడం లేదు. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెరుగుతున్నట్టే.. మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. ఇప్పటికే తమిళ్, హిందీ సినిమాల్లో హీరోగా నటించిన దుల్కర్, ఇప్పుడు తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. ఇక్కడ హనూ రాఘవపూడి దర్శకత్వంలో స్ట్రయిట్ మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు. 

 


దుల్కర్ సల్మాన్ ఇప్పటికే ఓ కాదల్ కణ్మణి సినిమాతో తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్వాన్, ది జోయా ఫ్యాక్టర్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా సందడి చేశాడు. మహానటిలో జెమినీ గణేషన్ గా నటించి ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఓకే బంగారం లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగునాట మంచి రిజల్ట్స్ అందుకున్నాడు. ఇప్పుడీ గుర్తింపుతోనే మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నాడు దుల్కర్. 

 


దుల్కర్ సల్మాన్ ఇంతకుముందు వైజయంతి బ్యానర్ లో ఓ తెలుగు సినిమా చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు హనూ రాఘవపూడికి ఓకే చెప్పాడనే ప్రచారం జరుగుతోంది. మరి దుల్కర్, హనూ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తుందా లేదా అనేది తెలియాలి. అయితే లై, పడిపడి లేచె మనసుతో నెగిటివ్ రిజల్ట్స్ తెచ్చుకున్న హను, దుల్కర్ తో ఎలాంటి సినిమాలు తీస్తాడు అనేది చూడాలి. మొత్తానికి ఇతర భాషా హీరోలు తెలుగులో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టావీవుడ్ లో తమ సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: