నవ్వుతూనే నవరసాల్ని పండించేస్తున్నారు. బాలీవుడ్ లోని ఈ ఇద్దరు భామలు. అయితే.. ఈ ఇద్దరి బ్యూటీల విషయంలో మూడు విషయాలు ఒక్క తిరుగానే ఉన్నాయట. అవేంటో చూద్దాం మరి.. ఒకటి నవ్వు, రెండవది బాయ్ ఫ్రెండ్స్, మూడవది ట్యాలెంట్ తో ఏలడం.. ఆ ఇద్దరు మరెవరో కాదు. అలియా భట్, దీపిక పదుకునే.. 

వీరిద్దరు ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారు. దానికి ఇదిగో ఈ ఫోటోనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ఇద్దరు భామలు ఓ అవార్డు ఫంక్షన్ లో చెవులు కొరికేసుకుంటున్నారిలా. మరీ అంతగా ఏం గుసగుసలాడేసుకున్నారో కానీ.. ఆ ముఖారవిందాల్లో నవ్వు చూస్తుంటే ఏదో రహస్యమే మాట్లాడేసుకున్నారని అర్థమవుతోంది.

 

 

ఆ ఇద్దరు కెరీర్ పరంగా.. ఫాలోయింగ్ పరంగా ది బెస్ట్ ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపికా పదుకొనే - అలియా భట్ కెరీర్ పరంగా అన్నివేళలా ఫుల్ బిజీగా ఉన్నారు. దీపిక నటించిన ఛపాక్ ఇటీవలే రిలీజైంది. ఆ వెంటనే తదుపరి చిత్రంపైనా దీపిక దృష్టి సారించింది. ఇక అలియా భట్ కూడా  సడక్ 2 - గంగూబాయి కతియావాడి అనే రెండు చిత్రాలతో బిజీగా ఉంది. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడిది? అంటే.. గతేడాది జీ సినీ అవార్డు వేడుకలో అలియా - దీపిక ఇద్దరూ రెడ్ కార్పెట్ నడకలతో అదరగొట్టినప్పటిది. ఆ ఇద్దరూ అలా చెవిలో గుసగుసలాడేసుకుంటుంటే చూసేవాళ్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అసలు వీరు ఇంతగనం ఏం మాట్లాడుతున్నారో ఏమో అని చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. ప్రస్తుతం అలియా భట్, రణబీర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కరోనా వల్ల వాయిదా పడింది.

 

 

కొంతమంది ఆ ఇద్దరి కామన్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ గురించే మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఇక రణబీర్ తొలి ప్రేయసి దీపికకు అతడి ప్రస్తుత ప్రేయసి ఆలియా చాలా క్లోజ్. మరి దీపిక .. కత్రిన లాంటి అందగత్తెలకు హ్యాండ్ ఇచ్చిన రణబీర్ నే ఈ అమ్మడు ఎందుకు ఎంపిక చేసుకుంది? అన్నదానికి ఇప్పటికీ సరైన ఆన్సర్ మాత్రం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: