బిగ్ బాస్ షోలో కి వెళ్ళిన వారికి ఎంతగానో క్రేజ్ పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలామంది వరుస అవకాశాలు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. ఇలా బిగ్ బాస్ షో చాలామంది సెలబ్రెటీల క్రేజ్  ని ఎక్కడికో తీసుకెళ్ళింది. అయితే కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 లో మీరా  మిథున్ కంటెస్టెంట్ గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీరా మిథున్... ప్రస్తుతం చెన్నైలో మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నది . ఓవైపు మోడల్ గా రాణిస్తూనే ఇంకోవైపు చిత్రాల్లో కూడా నటిస్తుంది  ఈ ముద్దుగుమ్మ. 

 

 

 అయితే కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మీరా మిథున్  బిగ్ బాస్ లో ఎంతో సందడి చేసింది. దాదాపు 35 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఇతర సభ్యులకు గట్టిపోటీని ఇవ్వడంతోపాటు అటు  ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది . ఇక బిగ్ బాస్  హౌస్ లో  ఈ అమ్మడికి ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి బిగ్ బాస్ లో ఈ అమ్మడు వివాదాలే కారణం అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అతని అభిమానులను అలరిస్తూనే  ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. వివిధ రకాల డిజైనర్ డ్రస్సులు.. మోడ్రన్ డ్రెస్సులతో  ... సోషల్ మీడియా వేదికగా మీరా మిథున్ చేసే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. 

 

 

 నెటిజన్లు అందరికీ హిట్ పుట్టించేలా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు సినిమాల  కంటే వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే మీరా మిథున్  గత కొన్ని నెలల క్రితం వర్తమాన మోడల్స్ కోసం అందాల పోటీ నిర్వహించాలని భావించగా...  పలు వివాదాలు కారణంగా ఈ అందాల పోటీ కాస్త రద్దయిపోయింది. తాజాగా ఈ అమ్మడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఫోటోలను కొంతమంది వ్యక్తులు మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్సైట్ లలో  కూడా పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ మరోసారి పెద్ద వివాదాన్ని సృష్టించింది. తను డీటెయిల్స్ ఫోన్ నెంబర్ కూడా అప్లోడ్ చేశారు అంటూ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. దీనిపై వెంటనే తమిళనాడు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: