టాలీవుడ్ లో ఒకప్పుడు మాంచి ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఏ సినిమాకి మ్యూజిక్ అందించినా మ్యూజిక్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సవ్వాల్సిందే. ప్రత్యేకంగా ఆడియో హిట్ కోసమే దేవీ తో సినిమా చేయిం చుకునే వాళ్ళు డైరెక్టర్ అండ్ హీరోస్. కుర్ర హీరోల దగ్గర్నుండి మెగాస్టార్ వరకు అందరికి దేవీ అంటే మంచి గురి. ఖచ్చితంగా మంచి మాస్ బీట్స్ ఇస్తాడని ఆ ఆల్బం అదిరిపోద్దని. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవడానికి ముఖ్యంగా ముందు ఆడియో జనాలలోకి వెళ్ళి సాంగ్స్ సూపర్ హిట్ అవ్వాలి. అలా అయితే సగం సినిమా హిట్టయినట్టే. అందుకే ప్రతీ సినిమాకి మ్యూజిక్ ప్రధానమైన కారణం అంటారు.

 

ఇక దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడి సాంగ్స్ కూడా బాగా హిట్ అవుతుంటాయి. అంతేకాదు హీరోలతోను సాంగ్స్ పాడిస్తూ వాళ్ళకి ఉత్సాహాన్నివ్వడమే కాకుండా ఆడియో ఈవెంట్స్ లో వాళ్ళతో డాన్సులు చేయించి నానా హంగామా చేస్తాడు. ఇది సినిమా సక్సస్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇక హీరోలందరు దేవీ ఇచ్చే మాస్ బీట్స్ అండ్ ట్యూన్స్ కి బాగా డాన్స్ చేసే స్కోప్ ఉంటుందనే ప్రత్యేకించి దేవీ శ్రీ ప్రసాద్ ని తమ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటారు. అయితే గత కొన్ని రోజులుగా దేవీ బాగా ఫాం కోల్పాయాడు. 

 

మునుపున్న జోష్ తనలో గాని తను ఇచ్చే సాంగ్స్ లో గాని ఉండటం లేదు. అంతేకాదు దేవీ ఇస్తున్న ట్యూన్స్ బాగా రిపీటవుతున్నాయన్న కంప్లైంట్స్ కూడా రెగ్యులర్ గా రావడం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో థమన్ స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ చేస్తూ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తూ దేవిశ్రీ ప్రసాద్ కి చెక్ పెట్టాడు. వరుసగా థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుండటంతో దేవిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఉప్పెన సినిమా నుండి పాటలు వచ్చాయి.

 

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాకి దేవి సంగీతం అందించాడు. ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రెండు పాటలు హిట్ అవడంతో దేవికి అభిమానుల నుండి ఒక రిక్వెస్ట్ వచ్చిందట. తెలుగులో ప్రస్తుతం టాప్ సింగర్ గా వెలుగుతున్న సిద్ శ్రీరామ్ తో దేవి పాట పాడించాలని కోరుతున్నారట. అందుకు కారణం సిద్ శ్రీరామ్ పాడిన ఏ పాట అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. తన వాయిస్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. దాంతో దేవినీ తన సినిమాలో పాడించే అవకాశం సిద్ శ్రీరామ్ కి ఇవ్వమని అడుగుతున్నారట. అయితే ఇది తెలిసిన కొంతమంది సెటైర్ వేస్తూ ఆయనకే దిక్కులేదు ఇక ఇంకొకరికేమిస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: