తెలుగు సినిమాలనే కాకుండా యావద్భారత చిత్ర పరిశ్రమకు కూడా సినిమా తీసే టెక్నిక్ ను నేర్పించిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు పేరు ఉంది. 1989లో వచ్చిన శివ సినిమాతో సరికొత్త టేకింగ్ తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు.. సినిమా తీసే విధానాన్నే మార్చేశాడు. అలా మొదలైన ఆర్జీవీ ప్రస్థానం ఎన్నో ప్రయోగాలు చేసేలా చేసింది. ఎందరో నటీనటుల్ని, టెక్నీషియన్లను టాలీవుడ్, బాలీవుడ్ లో పరిచయమయ్యేలా చేసింది. అలా.. ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన నటుల్లో బాలీవుడ్ లో మనోజ్ బాజ్ పాయ్ కూడా ఉన్నాడు.

 

 

 

సత్య సినిమాతో పరిచయమైన మనోజ్ బాజ్ పాయ్ హిందీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆర్జీవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ లేకపోతే నేనే కాదు సినిమాలకే కొత్త పోకడ వచ్చేది కాదు. ఎన్నో కొత్త కొత్త టెక్నిక్ లను పరిచయం చేశాడు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి హిట్ సాధించాడు. ఎవరైనా టచ్ చేయడానికి భయపడే మాఫియాలను అలవోకగా ఎన్నో సినిమాల్లో తెరకెక్కించాడు. ఎందరో టెక్నీషియన్లు, నటులు ఆయన పేరుతో వచ్చి సినిమాల్లో పేరు తెచ్చుకుని స్ధిరపడ్డారు. ఆ లిస్టులో నేనూ ఉన్నాను. రామూ ఓ లెజండరీ డైరక్టరే కాదు.. ఓ విజనరీ డైరక్టర్ కూడా’ అంటూ ఆకాశానికెత్తేశాడు.

 

 

 

మనోజ్ చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. మైథలాజికల్ తప్ప ఆర్జీవీ టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. మాఫియాను ఆడుకున్నాడు. తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్ లో టాప్ డైరక్టరయ్యాడు. అమితాబ్ తోనే మూడు సినిమాలు చేయగలిగాడు. ఈమధ్య కొన్ని సినిమాల ద్వార విమర్శలకు గురవుతున్నాడు కానీ.. రామూ టాలెంట్ ను, విజన్ ను ఏమాత్రం తక్కువ చేసి చూడలేం. మనోజ్ మాటలతో ఆర్జీవీ గోల్డెన్ డేస్, సబ్జెక్ట్స్ ఎంత సెన్సేషనో మరోసారి గుర్తు చేసినట్టైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: