కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ ను సైతం వెనక్కి నెట్టిన విజయ్ తన ప్రతి సినిమాతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. విజయ్ సినిమా అంటే చాలు కోలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది. కచ్చితంగా సినిమా ఎలా ఉన్నా సరే 200 కోట్లు రాబడుతుంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి సెన్సేషనల్ డైరక్టర్ విజయ్ తో కలిసి సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 

అది కూడా ఒక సూపర్ హిట్ సినిమా సీక్వల్ కోసం ఇద్దరు కలిసి పనిచేస్తారట. సౌత్ డైరక్టర్స్ లో మురుగదాస్ కు ఉన్న క్రేజ్ వేరు. బాలీవుడ్ లో సైతం సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఆయన. అందుకే తెలుగు, తమిళ భాషల్లో ఆయనకు సెపరేట్ ఇమేజ్ ఉంటుంది. ఇక మురుగదాస్ తో ఇళయదళపతి విజయ్ కలిసి సినిమా చేస్తే ఫ్యాన్స్ కు పండుగే. తుపాకీ, సర్కార్ సినిమాలు ఈ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. 

 

ఇక మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తుపాకీ సీక్వల్ చేస్తారట. తమిళంలోనే కాదు తెలుగులో కూడా తుపాకీ హిట్ అయ్యింది. ఆ సినిమా చూశాకనే మురుగదాస్ కు మహేష్ ఛాన్స్ ఇచ్చాడు. అలా చేసిన స్పైడర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొత్తానికి విజయ్ మురుగదాస్ ఇద్దరు కలిసి ఒక సూపర్ హిట్ మూవీ సీక్వల్ చేయడం ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్తే అని చెప్పొచ్చు. ఈ సీక్వల్ జరిగితే తెలుగులో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న మాస్టర్ సినిమా మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: