ప్రతీ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెద్దది చేసి చూపిస్తూ ఉంటారు జనం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు అన్నీ కూడా ప్రజలను అన్ని విధాలుగా భయపెడుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో కూడా ఇలాంటిదే దాదాపుగా జరుగుతుంది చెప్పుకోవచ్చు. అనవసరంగా జనాలను మీడియా భయపెడుతుంటే సోషల్ మీడియా మరింతగా భయపెడుతూ భయంతోనే చంపేసే ప్రయత్న౦ చేస్తూ వస్తుంది. మీడియాలో ఎక్కువగా కరోనా కథనాలు వస్తున్నాయి. దానిని సోషల్ మీడియా మరో కోణంలో ప్రచారం చేస్తుంది. 

 

ఉల్లిపాయ నిమ్మకాయ కలిపి తింటే కరోనా వైరస్ రాదని చెప్తుంది సోషల్ మీడియా. అలాగే పొగ పీలిస్తే కరోనా వైరస్ వేడికి చచ్చిపోతుంది అనే ప్రచారం కూడా మీడియాలో ఎక్కువగానే జరుగుతుంది. ఇది నిజం అనుకునే జనం కూడా ఉన్నారు. అదే విధంగా వెల్లుల్లి పాయ తింటే కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదనే ఒక రకమైన ప్రచారం జనాల్లోకి బలంగా వెళ్ళింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కరోనా ఎలా వస్తుంది అనే దాని మీద కూడా అనవసర ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా. ఎవరు అయిన జ్వరం తో చనిపోతే మాత్రం కరోనా కారణంగా చనిపోయారు అని చెప్పడం అలవాటు చేసుకుంది సోషల్ మీడియా. 

 

ఇటీవల తెలంగాణాలో ఒక బాలుడు అనారోగ్యం కారణంగా చనిపోతే అతను కరోనా కారణం గా చనిపోయాడని చెప్పారు. ఇక చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుంది అనేది కూడా మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతుంది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతుంది ప్రస్తుతం. దీని దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ అన్ని విధాలుగా నష్టపోయింది కూడా. అయినా సరే ఈ ప్రచారం మాత్రం దేశంలో ఆగే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు అనే చెప్పాలి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: