ఏ మాటకు ఆ మాట గాని మన దేశంలో జనాలకు కాస్త భక్తి ఎక్కువ అనేది వాస్తవం. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటారు. దేవాలయాలకు వెళ్ళే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది అనేది వాస్తవం. ప్రతీ చిన్న విషయానికి దేవాలయానికి వెళ్లి మొక్కు చెల్లిస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రభుత్వాలు ఈ విషయంలో కఠిన సలహాలు చేస్తున్నాయి ప్రజలకు. దేశంలో ఉన్న అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా ఇప్పుడు మూత పడ్డాయి. 

 

తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూసి వేసారు. అలాగే షిర్డీ దేవాలయం తో పాటుగా పలు కీలక దేవాలయాలను మూసి వేసారు అధికారులు. తమిళనాడు సహా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు దేవాలయాలను మూసి వేసారు అధికారులు. దీనితో దేవాలయాలకు వచ్చే ఆదాయ౦ భారీగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పట్లో చాలా దేవాలయాలు తెరిచే పరిస్థితి లేదనే చెప్పాలి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను తెరిచి ఉంచే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనితో మన దేశంలో దేవుడ్ని కూడా కరోనా ఇబ్బంది పెడుతుంది. 

 

తెలంగాణాలో ఉగాది నాడు నిర్వహించే పంచాంగ శ్రవణం కూడా ఆపేశారు. అలాగే భద్రాచలం లో రాముల వారి కళ్యాణం కూడా ఆపి వేసారు. లైవ్ లో చూపిస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో అన్నారు. ఇక తమిళ నాడు లో ఎక్కువ దేవాలయాలను మూసి వేసారు అధికారులు. ఉత్తర భారత దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రజలు కూడా కరోనా దెబ్బకు గుడికి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. మరి ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి. ఇప్పటికే దేశాల ఆర్ధిక వ్యవస్థ అన్ని రూపాల్లోను పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దేవాలయాల ఆదాయం కూడా పడిపోయే అవకాశం కనపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: