'ఆర్ఎక్స్100' సినిమా తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన గ్లామర్ క్వీన్ పాయల్ రాజ్‌పుత్. పాయల్ అంటే ఏంటో తనలో ఉన్న హాట్ నెస్ ఏంటో ఈ ఒక్క సినిమా చాలు క్లియర్ గా చెప్పడానికి. ఇండస్ట్రీ తో పాటు జనాలు ఆఎ.ఎక్స్ 100 చూసి పాయల్ సౌత్ లో కొంతకాలం ఏలేస్తుందనుకున్నారు. కాని అంత సీన్ లేదని తెలియడానికి ఎంత కాలమో పట్ట లేదు. పాపం ఎందుకో పాయల్ కి కాలం కలిసి రాలేదు. అందం అభినయం తో పాటు తెగువ ఉన్నా పాయల్ గుంపులో గోవిందా అయిపోయింది.

 

'ఆర్ఎక్స్100' సినిమాలో సెక్సీగా, గ్లామర్ గా కనిపిస్తూనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి చాలా పాపులర్ అయింది. కానీ స్టార్ హీర్పయిన్ గా మాత్రం ఛాన్సులు దక్కడం లేదు. 'ఆర్ఎక్స్100' తర్వాత పాయల్ కు 'ఆర్డీఎక్స్100' లాంటి చిన్న చిన్న సినిమానే మళ్ళీ వచ్చింది. 'ఆర్డీఎక్స్100' సినిమాలో 'ఆర్ఎక్స్100' ని మించి అందాలను ఆరబోసినప్పటికీ ఆ సినిమా దారుణంగా ఫాపయింది. అయితే లక్కీగా విక్టరీ వెంకటేష్ నటించిన 'వెంకీమామ' సినిమాలో ఛాన్స్ రావడం తో పాయల్ మాత్రమే కాదు అందరు షాకయ్యారు. పాయల్ కి లైఫ్ టర్న్ అయ్యో సినిమా అనుకున్నారు. పాయల్ కూడా ఈ సినిమా మీదా చాలా నమ్మకంగా ఉండింది. కానీ ఈ సినిమా పాయల్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు.

 

దాంతో పాయల్ 'వెంకీమామ' సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా డైరెక్టర్ బాబీ 'వెంకీమామ' సినిమాలో తన పాత్రను వెంకీ ఏజ్ కి సరిపోయోలా సీనియర్ హీరోయిన్ గా బాగా పెద్ద దానిలా చూపించాడని దాంతో నాకు సినిమాలు రాకుండా పోయాయని  తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఫీలవుతుందట. వాస్తవం గా చూస్తే ఈ సినిమా మరో హీరోయిన్ రాశీ ఖన్నా కి పెద్ద గా ఉపయోగపడింది లేదు.

 

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వెంకీ లాంటి సీనియర్ హీరో తో ఘాటుగా రొమాన్స్ చేయడానికి వీలుండదు. ఆయన ఫ్యామిలీ హీరో. కుర్ర హీరోలతో చేసినట్టు గా ఇంకా చెప్పాలంటే 'ఆర్ఎక్స్100' లా అందాలు ప్రదర్శించడానికి లిప్ కిస్సులు ఇవ్వడానికి కుదరు. అది చూసుకునే సినిమా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఫీలైతే లాభం లేదు కదా. నిన్ను అన్ని సినిమాలు 'ఆర్ఎక్స్100' లా గ్లామరస్ గా హాట్ గా చూపించవు కదా ..! 
 

మరింత సమాచారం తెలుసుకోండి: