బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఈజీగా నెట్టుకు రావొచ్చు. ఇంట్లో ప్రొడ్యూసర్లు ఉన్నారంటే సగం టెన్షన్లు తీరిపోతాయి. అందుకు బ్యాగేజ్ ఉన్నోళ్లకు కెరీర్ సాఫీగా ఉంటుందని చెబుతారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సక్సెస్ కాలేకపోతున్నారు. సాలిడ్ మార్కెట్ సంపాదించుకోలేకపోతున్నారు. అంటే ఇండస్ట్రీలో అందరికీఈ బ్యాక్ గ్రౌండ్ పనిచేయడం లేదా.

 

నాగార్జున తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్. కెరీర్ బిగినింగ్ లో బాగానే హిట్స్ కొట్టిన సుమంత్ కు కొన్నాళ్లుగా బ్యాడ్ టైమ్ రన్ అవుతోంది. సత్యం, గౌరి తర్వాత ఆ రేంజ్ లో హిట్స్ లేక మార్కెట్ లో డౌన్ అయ్యాడు. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ కి తగ్గట్టుగా స్టార్ రేసులో దూసుకెళ్లలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ హీరో కవలుధారి అనే కన్నడ సినిమాను కపటధారి గా రీమేక్ చేస్తున్నాడు. 

 

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సుశాంత్. చి.ల.సౌతో మెప్పించినా.. అమ్మ నాగ సుశీల నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నా.. సుశాంత్ కెరీర్ బ్యాక్ గ్రౌండ్ కు తగ్గ స్థాయిలో ముందుకెళ్లడం లేదు. ఇంకా ఈ హీరో స్థిరమైన మార్కెట్ సంపాదించుకోవడానికి ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం సుశాంత్ నో పార్కింగ్-ఇచ వాహనములు నిలుపరాదు అనే సినిమాలో నటిస్తున్నాడు. 

 

మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఇప్పటికీ ఆ రేంజ్ కు తగ్గ హిట్స్ కొట్టలేకపోతున్నాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో ఓకే అనిపించుకున్నా.. బాక్సాఫీస్ కు మినిమం గ్యారెంటీ అనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాడు. రీసెంట్ గా మళయాళీ హిట్ ఏబీసీడీని అదే పేరుతో రీమేక్ చేస్తే కలిసిరాలేదు. 

 

ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్ బిగినింగ్ నుంచి భారీ సినిమాల్లోనే నటిస్తున్నా.. బడ్జెట్ కు తగ్గ భారీ హిట్ లు అందుకోలేకపోతున్నాడు. రాక్షసుడు మాత్రమే ఓకే అనే రిజల్ట్ వచ్చింది. అయితే కెరీర్ కు కొంచెం బూస్టప్ ఇచ్చుకోవడానికి అల్లు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు బెల్లంకొండ. 

మరింత సమాచారం తెలుసుకోండి: