హీరోయిన్ ని చూస్తే పక్కింటి అమ్మాయిలా అనిపిస్తోంది... తమిళంలో ప్రేమమ్  సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు... తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ  సినిమాలో గడుసు పిల్ల పాత్రలో  నటించి అందరినీ ఆకర్షించింది. ఇక ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే వరుస సినిమా అవకాశాలను అనుకుంది  కానీ... ఎక్కడ అందాల ఆరబోత మాత్రం చేయలేదు ఈ అమ్మడు. మంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ కి కాస్త దూరంగా ఉండడంతో సరైన అవకాశాలు కూడా ఈ అమ్మడికి రాలేవు అనే చెప్పవచ్చు. 

 

 

 ఇక ఎంతో మంది హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్న  ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. పర్ఫామెన్స్ పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ గ్లామర్ విషయానికొచ్చేసరికి కొన్ని నిబంధనలు పెట్టుకోవడంతో... దర్శకనిర్మాతలు అంతగా అనుపమ వైపు ఆసక్తి చూపలేదు. శతమానం భవతి లాంటి సినిమాలతో మంచి పర్ఫామెన్స్ చేసి గుర్తింపు సంపాదించినా... ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు, కృష్ణార్జున యుద్ధం లాంటి విభిన్నమైన సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలకు ప్రేక్షక ఆదరణ కరువై... డిజాస్టర్ గా నిలవడంతో అనుపమ పరమేశ్వర్ కెరియర్ అయోమయంలో పడిపోయింది. 

 

 

 ఇక గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన రాక్షసుడు సినిమాలో మళ్లీ సక్సెస్ అందుకుంది  అయినప్పటికీ ఈ సినిమా ఈ అమ్మడి కెరియర్ కు  కలిసి రాలేదు. దీంతో అవకాశాలు కూడా అందుకోలేక పోతుంది ఈ ముద్దుగుమ్మ. అవకాశాల కోసం గ్లామర్ రోల్స్ చేయడానికి అయితే సిద్ధపడడం లేదు. దీంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందట అనుపమ పరమేశ్వరన్. ఇకనుంచి తమిళ మలయాళ చిత్రాలను చేయాలనే ఆలోచనలో అనుపమ పరమేశ్వరన్ ఉన్నట్లు సమాచారం.అయితే ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న పర్ఫామెన్స్ పరంగా మాత్రం అందరినీ అలరించి...డబ్బింగ్ కూడా తనకి తానే చెప్పుకునేది అనుపమ పరమేశ్వరన్. ఇలాంటి టాలెంట్ హీరోయిన్ కి అవకాశాలు దొరకకపోవడం కాస్త బాధ కలిగించే అంశమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: