కరోనా ప్రభావం ప్రతీ రంగం మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే వ్యాపార వాణిజ్య రంగాలు కుదేలు కాగా తాజాగా పత్రికా రంగం మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. కరోనా భయంతో ప్రజలు మేగజైన్లు కొని చదివేందుకు జంకుతున్నారు. గత కొద్ది రోజులుగా మేగజైన్ల అమ్మకాలు తీవ్ర స్థాయిలో పడిపోవటంతో పబ్లిషర్లు ఆలోచనలో పడ్డారు. ఈ ప్రభావం సెన్సేషనల్ మ్యాగజైన్‌ ప్లే బాయ్ పైన కూడా పడింది.

 

దీంతో దాదాపు 66 సంవత్సరాల తరువాత ప్లే బాయ్ పత్రిక తన ప్రింటింగ్ ను నిలిపి వేస్తున్నట్టుగా ప్రకటించింది. 1960లో ప్రారంభమైన ఈ పత్రిక న్యూడ్ ఫోటో షూట్ లతో సంచలనం సృష్టించింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ పత్రిక ఈ వారం వెలువడనున్న ఎడిషన్‌ తమ చివరి ప్రింట్‌ ఎడిషన్‌గా ప్రకటించింది. భవిష్యత్తులో ఏవైన ప్రత్యేకమైన ఎడిషన్స్‌ను ప్రింట్ చేసే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్‌ ఎడిషన్‌ మాత్రం ఇక మీద ప్రింట్ చేయమని యాజమాన్యం వెల్లడించింది.

 

ఈ నేపథ్యంలో సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బెన్‌ కాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `కరోనా వైరస్‌ ప్రభావం పెరిగిన తరువాత మేం మా కంటెంట్ ప్రొడక్షన్‌ సప్లై టీంతో చర్చలు జరిపాం. మా యూఎస్‌ ప్రింట్‌ ఎడిషన్‌ ను పాఠకులకు రక్షిత మార్గాల్లో ఎలా అందజేయాలనదేనిమీదే ప్రధానంగా చర్చిచాం. ప్రస్తుతానికి ప్లేబాయ్‌ ప్రింటింగ్ నిలిపివేస్తున్నాం 2021లో ప్లే బాయ్ డిజిటల్‌ ఎడిషన్‌తో పాటు మరిన్ని కొత్త ప్రాడక్ట్స్‌ ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాం.

 

మేం ప్రింట్‌ ఎడిషన్ తోనే మార్కెట్‌ లోకి వచ్చాం. అందుకే భవిష్యత్తులోలనే ప్రింటింగ్‌ను ఏదో ఒక రూపంలో కొనసాగిస్తాం` అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్లే బాయ్ వందల మిలియన్ల పాఠకులకు చేరువైంది. అందుకే ఇక మీదట మేం వారికి మరింత చేరువైయ్యేందుకు సరికొత్త దారులను అన్వేషిస్తున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: