తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు మారుతికి మంచి గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలతో ప్రారంభమైన మారుతి కెరియర్ ప్రస్తుతం స్టార్ హీరోలను సైతం దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగింది. మారుతి సినిమా అంటే ఏదో స్పెషాలిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే మారుతి సినిమాపై ఎప్పుడు అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి. ఇక మారుతి తెరకెక్కించిన సినిమాలు కూడా మంచి విజయం సాధిస్తూ ఉంటాయి. మారుతి సినిమాలో కామెడీ.. ఫ్యామిలీ ఎమోషన్స్ సమపాళ్లలో దట్టిస్తూ ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తుంటారు మారుతి. ఇలా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా మహానుభావుడు. హీరో శర్వానంద్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి  మంచి విజయాన్ని అందుకుంది. 

 

 

 ముఖ్యంగా ఈ సినిమా అతి  శుభ్రం ప్రధానంగా సాగే చిత్రం. ఈ సినిమాలో హీరో శర్వానంద్ ఓసిడి  తో బాధపడుతూ ఉంటాడు. దీంతో ఓసిడి వ్యాధి  కారణంగా శర్వానంద్ చేసే చేష్టలు అతను పడే బాధలు... ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక శర్వానంద్ అతిశుభ్రత కోసం  చేసే చేష్టలు  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఓసిడి  తో బాధపడుతున్న యువకుడిగా శర్వానంద్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం మహానుభావుడు సినిమాలో దర్శకుడు మారుతి చెప్పింది ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఫాలో అవుతోంది. ప్రపంచంలోని ప్రతి మనిషి ప్రస్తుతం చెప్పేది ఒక్కటే... చేతులను శుభ్రంగా కడుక్కోండి... దగ్గు తుమ్ము ఉన్న వారికి దూరంగా ఉండండి అంటూ సూచిస్తున్నారు. 

 

 

 

 ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన మహానుభావుడు సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ప్రస్తుతం కరోనా  వైరస్ ఎఫెక్టుతో పరిస్థితి ఈ విధంగా ఉంది అంటూ... మహానుభావుడు సినిమాలోని కొన్ని సన్నివేశాలను ముడిపెడుతూ కామిడీ వీడియోలను చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఒకప్పుడు ఈ సినిమా పాపులర్ అయిన దానికంటే ప్రస్తుతం కరోనా  వైరస్ వల్ల మరింత పాపులారిటీ సంపాదించింది. దీనిపై తాజాగా దర్శకుడు మారుతి కూడా స్పందించారు... భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని తెలిస్తే ఇంకా బాగా తీసే వాడినే అంటూ చెప్పుకొచ్చారు. అతి శుభ్రం అంటే ఇంత దారుణంగా ఉంటారా అని ఈ సినిమా తెరకెక్కించిన  సమయంలో తాను కూడా నవ్వుకున్నాను అంటూ తెలిపారు. ఏదేమైనా కరోనా  వైరస్ వల్ల దర్శకుడు మారుతికి మంచి పాపులారిటీ వచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: