కరోనా ఎఫెక్ట్‌ తో ప్రస్తుత ప్రజలు అంతా ఇంటికే పరిమిత మవుతున్నారు. ముఖ్యంగా సినిమా షూటింగ్‌ లు, రిలీజ్‌ లు ఆగిపోవటంతో హీరో హీరోయిన్లు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో చాలా మంది సెలబ్రిటీలు క్వారెంటైన్‌ లో తాము ఎలా టైం పాస్ చేస్తున్నారో అభిమానులకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తున్నారు.

 

ఎక్కువగా హీరోయిన్లు తమ హో వర్క్‌ అవుట్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు, తాజాగా ఈ లిస్ట్‌ లోకి ఓ యంగ్ హీరో కూడా చేరాడు. టాలీవుడ్‌ లో హీరోగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ప్రిన్స్‌ తాను ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్‌లో వర్క్‌ అవుట్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోతో పాటు `క్వారెంటైన్‌, ఐరన్‌ అడిక్ట్‌, హోం జిమ్‌, అంటూ పలు హ్యాష్ ట్యాగ్ లను పోస్ట్ చేశాడు.

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాకు డాష్‌ డాష్ సినిమాతో హీరో పరిచయం అయిన ప్రిన్స్‌ తరువాత బస్ట్‌ స్టాప్‌, రొమాన్స్‌ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ తరువాత సరైన అవకాశాలు రాకపోవటంతో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. తాజాగా భారీగా కండలు పెంచి సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం కరోనా కారణం షూటింగ్ లు బంద్ కావటంతో ఇంటికే పరిమితమయ్యాడు ప్రిన్స్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My kinda #quarantine #ironaddict #homegym #paradise #lovingit #motivationforlife #fitlife #covid_19 #stayput #quickadjustment #goalsaregold

A post shared by prince Cecil (@princececil3) on

మరింత సమాచారం తెలుసుకోండి: