మాస్ మహా రాజ్ రవితేజ నటించిన నేల టిక్కెట్టు తో  తెలుగు లోకి ఎంట్రీఇచ్చింది యువ హీరోయిన్ మాళవిక శర్మ. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడం తో ఆ తరువాత ఆమెకు ఆఫర్లు రాలేదు.ఇక ఎట్టకేలకు  ఇటీవల రామ్ నటిస్తున్న రెడ్ తో మాళవిక మరో ఆఫర్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు కాగా ఆమె ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పుడు మాళవిక కు మరో ఆఫర్ వచ్చింది. ఈసారి కూడా రవితేజ కు జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.
 
రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ  డైరెక్షన్ లో రవితేజ నటించనున్న చిత్రంలో మాళవిక శర్మ  కథానాయికగా ఎంపికైంది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా రమేష్ వర్మ -రవితేజ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన వీర డిజాస్టర్ అయ్యింది అయినా కూడా రవితేజ ఆ దర్శకుడికి మరో  ఛాన్స్ ఇచ్చాడు. ఇక గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ లో నటిస్తున్నాడు.
 
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ఇప్పటికే  80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో ఈసినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. థమన్ సంగీతం అందిస్తుండగా మే 8న క్రాక్ ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈ సినిమాలే కాకుండా రవితేజ మరో రెండు సినిమా లకు గ్రీన్ సిగ్నల్ఇచ్చాడని సమాచారం. అందులో వక్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజసినిమా చేయనుండగా త్రినాథ రావ్ నక్కిన తో కూడా సినిమా చేయనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: