ఈ మ‌ధ్య టాలీవుడ్ హీరోల రెమ్యూన‌రేష‌న్లు వింటూ దిమ్మ‌తిర‌గాల్సిందే. ఒక్కొక్క‌ళ్ళు కోట్ల‌లో సంపాదిస్తున్నారు. ఒక కొంత మంది అయితే లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు. ఇంకొంత‌మంది డిజిట‌ల్ రైట్స్‌లో షేర్స్ ఇలా బాలీవుడ్ హీరోల‌ను మించిపోతున్నారు మ‌న‌వాళ్ళు. ఇక ఇదిలా ఉంటే మీకు మేము ఏమాత్రం త‌గ్గం అన్న‌ట్లు వారి భార్య‌లు కూడా అదే బాట‌లో సంపాదిస్తున్నారు. ఇక వీరిలో కొంత మంది సినిమాల్లో న‌టిస్తే మ‌రికొంత మంది వారికి న‌చ్చిన‌ రంగాల్లో రాణిస్తున్నారు. ఇక వారి ఇంట్ర‌స్ట్‌లు ఏంటి ఎంత సంపాదిస్తున్నారో ఓ లుక్కేద్దాం.

 

ఇక ఈ లిస్ట్‌లో ముందు వ‌రుస‌లో ఉంది హీరో నాని భార్య అంజ‌నా. ఆమె కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా  ఆర్కామీడియా సంస్థ‌కి మ‌రియు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కోసం ప‌ని చేస్తుంది. ఈమె డిజిట‌ల్ హెడ్‌గా ప‌నిచేస్తూ జీతం ల‌క్ష‌ల్లో అందుకుంటోంది. బాహుబ‌లి సైతం ర‌మారాజ‌మౌళి అంజ‌నా కాస్ట్యూమ్ చేత డిజైన్ చేయించ‌డం విశేషం. ఈమె నానికి ఏమాత్రం తీసిపోకుండా సంపాదిస్తుంది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈమె కూడా హెల్త్ క్యాంపుల‌ను నిర్వ‌హిస్తూ... అపోలో ఆసుప‌త్రిలో చురుకైన పాత్ర‌ని పోషిస్తోంది. రాంచ‌ర‌ణ్ బిజినెస్ వ్య‌వ‌హారాల‌న్నీ కూడా ద‌గ్గ‌రుండి చూసుకునేది ఉపాస‌నే. 

 

కామెడీ హీరో అల్ల‌రి న‌రేష్ భార్య విరూప కూడా ఈ వెంట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తూ ఒక్కో ఈవెంట్‌కు ల‌క్ష‌ల్లో తీసుకుంటుంద‌ట‌. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్  భార్య కూడా ఖాలీగా లేకుండా ఓ మ్యాగ‌జైన్‌కి చీఫ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తోంది. ఇక రాజీవ్ క‌న‌కాల భార్య సుమ కూడా ఆయ‌న‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా సంపాదిస్తోంది. బుల్లితెర పై యాంక‌ర్‌గానే కాకుండా. దాదాపు ప్ర‌తి స్టార్ హీరో ఫంక్ష‌న్ల‌కు ఈమె యాంక‌రింగ్ చేస్తోంది.  రాహుల్ ర‌వీంద్ర‌న్ భార్య ఈమె భ‌ర్త‌కంటేకూడా ఎక్కువే సంపాదిస్తోంది. గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మ‌య్ సంపాద‌న లెక్క‌కుమించిగా ఉంది. యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్ భార్య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భ‌ర్త సంపాద‌న‌కు ఏమాత్రం తీసిపోకుండా సంపాదిస్తుంది. అంతేకాక ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌హ‌రిస్తూ సెన్సార్‌బోర్డు మెంబ‌ర్‌గా కూడా ప‌ని చేస్తున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య భార్య సంపాద‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే పెళ్ళైన త‌ర్వాత ఈమె సంపాద‌న మ‌రింత పెరిగింద‌ని చెప్పాలి. కేవ‌లం సినిమాల్లో న‌టించ‌డ‌మే కాకుండా కొన్ని ప్ర‌ముఖ సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా ఈమె వ్య‌వ‌హ‌రిస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క్రేజ్ ఏంటో అంద‌రికి తెలిసిదే. అయితే ఆయ‌న మిగిలిన బిజినెస్‌ల‌న్నీ కూడా ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. మ‌హేష్‌కి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: