హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఇప్పటివరకు అఖిల్ కు సరైన హిట్ రాలేదన్న దిగులు నాగార్జునకు ఉంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచాయి. అందుకే కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బ్యాచ్ లర్ బాయ్ కు జోడిగా హాట్ బ్యూటీ పూజా హెగ్దే నటిస్తుంది. 

 

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈమధ్య గీతా ఆర్ట్స్ లో వస్తున్న చిన్న సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకుంటున్నాయి. అఖిల్ సినిమా కూడా హిట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో నాగార్జున ఇప్పటివరకు ఇన్వాల్వ్ కాలేదు కానీ ఎడిటింగ్ టైం లో మాత్రం నాగ్ దగ్గర ఉంటున్నడట. అఖిల్ కు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ఇవ్వాలన్న కసితో ఉన్న నాగార్జున సినిమా ఎడిటింగ్ రూమ్ లో తానూ కూర్చుకుంటున్నాడట. 

 

సినిమాలో అనవసరం అనిపించినవి నిర్మొహమాటంగా కట్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ సినిమా అంటే కంపల్సరీ హిట్ అన్నట్టే. అయితే భాస్కర్ ఈమధ్య ఫామ్ లో లేడు. అతన్ని నమ్ముకుని సినిమా చేస్తున్నాడు అఖిల్. అందుకే నాగ్  దిగాడని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది.. ప్రస్తుతం ఆమె సూపర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆమె కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం నాగార్జున సోలమన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  ఓ పక్క వేగంగా జరుపుకుంటున్న నాగ్ బంగార్రాజు సెట్స్ మీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్నాళ్లుగా హిట్టు కోసం వేచి చూస్తున్న నాగ్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: