1983 వన్డే ప్రపంచ కప్ రూపంలో భారత్ కు మొదటి వరల్డ్ కప్ అందించిన టీమిండియా లెజండరీ కెప్టెన్  కపిల్ దేవ్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 83. కబీర్ ఖాన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ , కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా కపిల్ దేవ్ భార్య రోమి దేవ్ పాత్ర లో రణ్వీర్ సతీమణి దీపికా పదుకొనే కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో  83 పై భారీ అంచనాలు వున్నాయి.
 
ఇక ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకావాల్సి ఉండగా  ప్రస్తుతం కరోనా వల్ల విడుదల వాయిదా పడిందని   త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేయనున్నారు.ఈచిత్రంలో ప్రముఖ మాజీ క్రికెటర్ల పాత్రల్లో తమిళ నటుడు జీవా ,రాజ్ బాసిన్, పంకజ్ త్రిపాఠి,బోమన్ ఇరానీ సాహిల్ కట్టర్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రం హిందీ తోపాటు తెలుగు ,తమిళ భాషల్లో  కూడా విడుదలకానుంది. తెలుగులో 83ని కింగ్ నాగార్జున  విడుదలచేస్తుండగా తమిళం లో ప్రముఖ హీరో కమల్ హాసన్ విడుదలచేయనున్నాడు. రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్స్, విబ్రి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 
 
ఇక ఈ చిత్రం తో పాటు రణ్వీర్ సింగ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్,అజయ్ దేవగణ్ లతో కలిసి సూర్యవంశీ లో కూడా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన సూర్యవంశీ ట్రైలర్ 70 మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 24న ప్రేక్షకులముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: