శ్రద్ధాదాస్.. తెలుగు ప్రేక్షకులు ఈ పేరు మరిచిపోయే అవకాశాలే ఎక్కువ.. అవును ఇంతకీ మీకు శ్రద్ధాదాస్ ఇప్పటికీ గుర్తుందా..? లేదంటే మరోసారి గుర్తు చేద్దాం.. అప్పుడెప్పుడో "ఆర్య 2" సినిమాలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ పాటలో అల్లు అర్జున్ ను తన అందాలతో బాగా కవ్వించిందీ ముద్దుగుమ్మ.

 

 

ఆ తర్వాత అడపాదడపా కొన్ని తెలుగు సినిమాలు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఎన్ని సినిమాలు చేసినా కూడా శ్రద్ధాదాస్‌ను ఏ ఒక్క దర్శకుడు కూడా శ్రద్ధగా చూపించలేదు. ఇక లాభం లేదనుకుని బాలీవుడ్ ను ఆశ్రయించింది. బాలీవుడ్ వెళ్లి అక్కడ "జిద్" లాంటి సినిమాల్లో హాట్ హాట్ అందాల ఆరబోసింది.. పాపం.. అక్కడా ఫలితం దక్కలేదు.

 

 

పాపం.. దాంతో ఫారెన్‌లోనే సెటిల్ అయిపోయి ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలకు ఫోజులిస్తోంది. అప్పుడప్పుడూ సినిమా ఈవెంట్స్‌లో పాటలు పాడుతూ కాలం గడిపేస్తుంది శ్రద్ధాదాస్. ఈ మధ్య పాంథర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోనూ నాభి అందాలతో అదరగొట్టింది.

 

 

ఇంత చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అందుకే మళ్లీ మరోసారి కసిగా హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కనిపిచింది. స్విమ్మింగ్ పూల్లో శ్రద్ధగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. సినిమాల్లేక చాలా కాలమే అయినా శ్రద్ధా ఫిగర్ ను మాత్రం బాగానే కాపాడుకుంటోంది. మరి ఇకనైనా ఈ హాట్ ఫోటోలు చూసి ఏ దర్శకుడైనా, నిర్మాత అయినా కరుణిస్తాడా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: