కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజా వణికిస్తోంది. చైనాలోని వుహాన్ జంతువుల మార్కెట్ లో పుట్టిందని చెప్పుకుంటున్న ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించింది. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న దేశాలలో చైనా ప్రథమ స్థానంలో నిలవగా, ఇటలీ, ఇరాన్, దక్షిణకొరియా వంటి దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ ని మహమ్మారిగా ప్రకటించింది.

 

 

 

 

అయితే ఈ కరోనా గురించి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఎవరికి తోచింది వారు రాసేస్తున్నారు. ఈ కరోనా గురించి ఒకానొక హాలీవుడ్ మూవీలో పది సంవత్సరాల క్రితమే చెప్పబడిందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 2011లో విడుదలైన ఈ హాలీవుడ్ చిత్రం పస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. కంటేజియన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు చాలామంది వీక్షిస్తున్నారు.

 

 

 

 

ఈ సినిమాలో కరోనా వైరస్ లాగే ఒకానొక వైరస్ ప్రపంచాన్నంతటినీ వణికిస్తుంది. కరోనా లాగే ఈ వైరస్ కూడా గాలిద్వార వ్యాపించి మనుషుల్ని ముప్పుతిప్పలు పెడుతుంది. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే సినిమాలోని వైరస్ కూడా చైనాలోనే పుడుతుంది. చైనా నుండి ప్రపంచానికంటటికి విస్తరించి మహమ్మారిగా మారుతుంది. ఇన్ని పోలికలున్న ఈ చిత్రం ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తుంది.

 

 

జంతువుల నుండి మనుషులకి వైరస్ సోకితే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఎన్ని రకాల వైరస్ లు జంతువుల నుండి మనుషులకి సోకుతాయి అన్న రీసెర్చి చేసి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. మొత్తానికి ప్రస్తుతం కరోనా గురించి ఓ పదేళ్ల కిందటే సినిమా రావడం ఆశ్చర్యకరమే.. ప్రస్తుతం ఇండియాలో కరోనా వల్ల ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడనప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: