ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా.. హీరో అయినా సినిమా పరంగా సమస్యల్లో ఉన్నది ఎవరంటే ఠక్కున మెదిలే పేరు మెగాస్టార్ చిరంజీవి. హీరోయిన్ సమస్యతో పాటు ఓ ఇంపార్టెంట్ రోల్ మహేశ్ చేస్తాడా.. చరణ్ చేస్తాడా అనేది కూడా తీవ్రమైన సస్పెన్స్ లో ఉంది. కానీ.. చరణ్ కే ఎక్కువ అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా హీరోయిన్ సమస్యగా ఉంది. కైరా అద్వానీ పేరు వినిపించినా కాదని తెలుస్తోంది. కానీ.. చరణ్ క్యారెక్టర్ కు మెగాస్టార్హీరోయిన్ ను సజెస్ట్ చేశారని సమాచారం.

 

 

రామ్ చరణ్ కు హీరోయిన్ గా చిరంజీవి కన్నడ బ్యూటీ, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయిన రష్మిక మందన పేరును సూచించారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం రష్మిక మంచి ఫేస్ లో ఉంది. వరుస హిట్లు, అందం, నటనతో యూత్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కాబట్టి.. ఆచార్యలో రామ్ చరణ్ చేసే క్యారెక్టర్ కు రష్మిక కరెక్ట్ గా సూటవుతుందని మెగాస్టార్ భావిస్తున్నాడట. ఈ మేరకు యూనిట్ ను రష్మికను కాంటాక్ట్ చేసి రామ్ చరణ్ కు హీరోయిన్ గా ఎంపిక చేయాలని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తపై అఫిషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.

 

 

నిజానికి మెగాస్టార్ కు హీరోయిన్ అంటే తమకు ఆ ప్రాజెక్టు వస్తే బాగుండును అనుకుంటారు. కానీ.. చివరి నిముషంలో త్రిష ఆచార్య ప్రాజెక్టు నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం వేట సాగుతోంది. త్రిష కాదనటంతో కాజల్ ను సంప్రదిస్తే దిమ్మతిరిగే రెమ్యునరేషన్ చెప్పడంతో వెనక్కు తగ్గిన యూనిట్ అనుష్క కోసం ట్రై చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చల్లబడ్డాక హీరోయిన్ల ఎంపికపై ఓ క్లారిటీ రానుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: