బుల్లితెరపై హైపర్ ఆది సుడిగాలి సుదీర్ ల కు మంచి క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ చూసినా ఈ ఇద్దరే  దర్శనమిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఇద్దరి కాంబినేషన్ బాగా హిట్ కావడంతో... ఏ ఈవెంట్ లో  చూసిన సుడిగాలి సుధీర్ హైపర్ ఆది లు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతగానో పాపులారిటీ సంపాదించిన ఇద్దరు కమెడియన్స్ ... ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్తు లు ఎవరికి వారు సాటి అన్నట్టుగా అదరగొడుతూ  దూసుకుపోతున్నారు. 

 

 ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న టాప్ టీమ్స్ ఏవి అంటే హైపర్ ఆది సుడిగాలి సుధీర్ టీమ్స్ అని చెబుతూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు. ఇక ఈ ఇద్దరూ మెగా ఫ్యామిలీ  కి వీరాభిమానులు అన్న విషయం తెలిసిందే. సమయం దొరికితే చాలు మెగా హీరోలపై తమ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. వీరిద్దరికీ మెగా బ్రదర్ నాగబాబు గాడ్ ఫాదర్ అని చెబుతుంటారు. సుడిగాలి సుదీర్ ఏకంగా నాగబాబు ని నాన్న అని పిలుస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో ని విడిపోయి... జీ తెలుగు అదిరింది అని షో లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ షో కి ఈ అదిరింది షో ని  పోటీగా  తేవాలి అనుకున్నప్పటికీ షో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావడం లేదు. 

 

 ఈ నేపథ్యంలో నాగబాబు మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అనేది కూడా గత కొన్ని రోజులుగా టాక్  వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి మల్లెమాల యాజమాన్యం మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై హైపర్ ఆది,  సుడిగాలి సుదీర్ నాగబాబును  జబర్దస్త్ తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మల్లెమాల  యాజమాన్యంతో కూడా వీరిద్దరు సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. అంతేకాకుండా మల్లెమాల వాళ్ళు కూడా నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పారట. కాని ప్రస్తుతం అదిరింది షో  కి కాంట్రాక్ట్ సైన్ చేశారు నాగబాబు. ఈ కాంట్రాక్టు దాదాపు ఏడాది పాటు ఉందట. ఇక ఈ కాంట్రాక్ట్ సమయం పూర్తయ్యేలోపు నాగబాబు ఎలాగోలా జబర్దస్త్ లోకి తీసుకురావాలని ఈ ఇద్దరు కమెడియన్స్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: