ప్రస్తుతం మహమ్మారి కరోనా పై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చైనా దేశం నుండి పలు ఇతర దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి పై మన దేశం కూడా గట్టిగా పోరాటం చేస్తోంది. నిన్న మన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, కరోనాను అంత తేలికగా తీసుకోవద్దని, ప్రస్తుతం దాని ప్రభావం మొదటి ప్రపంచ యుద్ధం కంటే కూడా దారుణ పరిస్థితులు మన దేశంలో ఏర్పడేలా చేసిందని అన్నారు. ప్రజలందరూ కూడా కలిసికట్టుగా తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తే తప్పకుండా ఈ మహమ్మారిని దరిచేరనీయకుండా చేయవచ్చని మోడీ అన్నారు. 

 

ఇక దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సెలెబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ లతో శుభ్రం చేసుకోవడం, అలానే తుమ్మినా, దగ్గినా నోటికి కర్చీఫ్, టిష్యు వంటివి అడ్డు పెట్టుకోవడం వంటి కొన్ని సూచనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మన ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవడం తో పాటు ఎక్కువగా ఉడికించిన ఆహారపదార్ధాలు తినాలని చెప్తున్నారు. ఇకపోతే నేడు కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ప్రజలకు కరొనా పై ఒక విజ్ఞప్తి చేసారు. 

 

ప్రస్తుతం కరోనా మన దేశంలో రెండవ దశలోనే ఉందని, ఇకపై దానిని మరింతగా ప్రబలకుండా చేయడానికి ప్రధాన మంత్రి మోడీ గారు చెప్పిన సూచనలను తప్పకుండా అందరం పాటించి దానిపై పోరాటం చేద్దాం అని, అలానే దీనిని అరికట్టేలా వ్యాధి సోకిన వారికి ఎంతో జాగ్రత్తగా చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు శంకర్. ఇటీవల తాను కమల్ తో తీస్తున్న భారతీయుడు 2 సినిమా విషయమై జరిగిన విషాద ఘటనతో కొంత కృంగిపోయిన శంకర్, కొద్దిరోజుల క్రితం ఆ సినిమా షూటింగ్ ని మళ్ళి మొదలెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఆ సినిమా కూడా మరొక 20 రోజుల పాటు షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసుకుంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: