తెలుగు, తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న సినిమాలు వరుసగా హిట్ అవుతున్న విషయం తెలిసిందే. అదిరింది, సర్కార్, విజిల్ ఈ మూవీలో తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యాయి.  ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మురుగదాస్.  ఇక మురుగదాస్-విజయ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  విజయ్ - మురుగదాస్ కాంబినేషన్లో 2012లో వచ్చిన 'తుపాకి' భారీ విజయాన్ని సాధించింది. ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన ఈ మూవీ త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. స్లీప‌ర్ సెల్స్ అనే అంశాన్ని తీసుకుని మురుగ‌దాస్ తెర‌కెక్కించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఔరా అనిపించింది.

 

స్లీప‌ర్ సెల్స్ ఎలా వుంటారు?.. ఏం చేస్తారు?.. ఎలా స్పందిస్తారు? వారి వ‌ల్ల ఎలాంటి వినాశ‌నం ఏర్పడుతుంది? వ‌ంటి అంశాల్ని సామాన్య ప్రేక్ష‌కుల‌కి సైతం ఈ సినిమాతో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు మురుగ‌దాస్‌. విజయ్ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అది 'తుపాకి' సీక్వెల్ అనేది తాజా సమాచారం. ఆల్రెడీ విజయ్ తో కథా చర్చలు జరిగినట్టుగా చెబుతున్నారు. 'తుపాకి' సినిమాను నిర్మించిన 'వి' క్రియేషన్స్ వారే సీక్వెల్ ను కూడా నిర్మించనున్నారు.

 

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. విదేశాల్లో అత్య‌ధిక భాగం షూటింగ్ జ‌రుపుకునే ఈ మూవీ అంత‌ర్జాతీయ స్థాయిలో వుంటుంద‌ని తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా మూవీ అన్న‌మాట‌. ఈ మూవీ కోసం 170 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మాస్తారు? ఎప్పుడు మొద‌ల‌వుతుంది వంటి విష‌యాల్ని త్వ‌ర‌లోనే మురుగ‌దాస్ వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: