దేశ రాజధాని నడిబొడ్డు.. 2012..డిసెంబ‌ర్ 16న  ఢిల్లీలో జ‌రిగిన అమాన‌వీయ ఘ‌ట‌న నిర్భ‌య. నిర్భ‌య‌ని ఆరుగురు క్రూర మృగాళ్లు అత్యంత పాశ‌వికంగా అత్యాచారం చేయ‌డంతో పదమూడు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది.  ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చంపిన కర్కోటకులను ఉరి తీయాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేశారు.  ఈ కేసును అప్పట్లో నిర్భయ నామకరణం చేశారు.. అంతే కాదు ఈ పేరు పై ఓ చట్టాన్ని కూడా తీసుకు వచ్చారు.  అయితే నిర్భయకు జరిగిన అన్యాయంపై చిన్నా, పెద్ద, ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ  రోడ్ల‌పైకి వ‌చ్చి నిర్భ‌య‌కు న్యాయం చేయాల‌ని, దోషుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని దిక్కులు పిక్క‌టిల్లేలా నిన‌దించింది.  

 

కానీ ఏడేళ్లుగా ఏ న్యాయం జరగలేదు.. పై కోర్టు అంటూ కాల‌యాప‌న జ‌రుగుతూనే వ‌చ్చింది. అయినా నిర్భ‌య త‌ల్లిలో స‌హనం చ‌చ్చిపోలేదు. హంత‌కుల‌ని ఉరికంబం ఎక్కించేంత వ‌ర‌కు భ‌యప‌డ‌న‌ని, ఎలాంటి బెదిరింపుల‌కు లొంగ‌న‌ని శ‌ప‌థం చేసిన ఆ త‌ల్లి చివ‌రి దాదాపు ఏడేళ్ల నిరీక్ష‌ణ‌కు ఫ‌లితం ల‌భించింది.  ఇన్నేళ్ల తర్వాత నిర్భయ నింధితులకు ఉరిశిక్ష అమలు చేశారు.  రు. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు దోషులు నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు.

 

తన కుమార్తె లేదని, ఇకపై రాదని పేర్కొన్న ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు. అంతే కాదు దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగభరితంగా అన్నారు. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్శ‌కులు హ‌రీష్ శంక‌ర్ త‌న‌దైన స్టైల్లో స్పందించారు. ఒక‌రి చావు త‌న‌కు బోలెడు రిలీఫ్‌ని ఇస్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని, అలాగే కొంత మందికి భ‌యాన్నిస్తే చాలని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: