యాంకర్ అనసూయ.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన వాళ్ల‌లో ఈమె కూడా ఒక‌రు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. జబర్దస్త్ వేదికగా టాలెంట్ చూపిస్తూ గ్లామర్ పరం గానూ సూప‌ర్‌ అనిపించుకుంటోంది ఈ బ్యూటీ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లోనూ నటించింది. అందులో ముఖ్యంగా సుకుమార్‌, రాంచరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా అన‌సూయ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

 

మ‌రో విష‌యం ఏంటంటే.. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ప్లానింగ్ సరిగ్గా ఉంటే సినిమాల్లో కూడా విజయం మీ వెంటే వస్తుందని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ముఖ్యంగా జబర్దస్త్ బ్యూటీగా అనసూయకున్న పాపులారిటీ ఆమెకు వరుస సినిమా అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఈ క్ర‌మంలోనే రంగ‌మ్మ‌త్త‌గానే కాకుండా ప‌లు సినిమాలు న‌టించి మెప్పించింది కూడా. అయితే ప్ర‌స్తుతం ఈమె ఎంత సంపాదిస్తుంది అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. యాంకర్ అనసూయ ఏడాదికి 2 కోట్లు సంపాదిస్తుంద‌ట‌. 

 

పెళ్ళై ఇద్దరు పిల్లలున్న యాంకర్ అనసూయ రెండు కోట్లు సంపాదించ‌డం అంటే నిజంగా మామూలు విష‌యం కాదు. బుల్లితెర‌పై సుమ కనకాల తర్వాత అనసూయ అనేలా ఆమె క్రేజ్ ద‌క్కించుకుంది.  హాట్ యాంకర్ గా పెళ్లి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. గ్లామర్ తోనే యాంకర్ అనే పదానికి కొత్తర్ధం తెలిసేలా చేసింది. అందుకే ఈటివి, జెమిని టివి, జీ ఛానల్ ఎక్కడ చూసినా అనసూయ క‌నిపిస్తుంది. అటు ఆడియో లాంచ్ వేడుకలు, ఇటు వెండితెర మీద అదిరిపోయే కేరెక్టర్స్.. మ‌ళ్లీ మధ్య మధ్యలో అవార్డు వేడుకల స్టేజ్ మీద స్పెషల్ పేరెఫార్మెన్సెస్‌తో అద‌ర‌గొడుతోంది. ఇలా అన‌సూయ‌ రెండు చేతులా రెండు కోట్లు సంపాదిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: