సూపర్ స్టార్ రజినీకాంత్ చక్కటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. ఈ సూపర్ స్టార్ అటు తమిళ్ లో ఇటు తెలుగు లో కూడా ఆనేక సినిమాలు చేసి ప్రసిద్ధి చెందాడు. ఈ హీరో సినిమాల నుండి ఇప్పుడు టీవి షోలో కనపడ బోతున్నాడు . అయితే ఈ మధ్య ఒక టీవీ షో షూట్ లో పాల్గొన్నాడు . మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ లో పాల్గొని ఆనేక సాహసాలు చేసాడు ఈ హీరో .

 

IHG

 

 

ఈ షో హోస్ట్ బేర్ గ్రిల్స్ రజిని తో చిందులు వేయించాడు. ఈ షో త్వరలోనే బుల్లి తెర మీద రాబోతోందిట. ఈ షో కోసం రజినీకాంత్ మూడు రోజుల పాటు షూటింగ్ చేసాడట. అయితే ఈ సూపర్ స్టార్ కి గాయం అయ్యిందట. అప్పుడు గాయం కారణంగా కొంత గ్యాప్ తీసుకుని మానిన వెంటనే మళ్ళీ షూటింగ్ కి వచ్చేసాడట.

 

ఈ షూటింగ్ కర్ణాటక లో బందిపూర్ టైగర్ రిజర్వ్ లో జరిగింది. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ షూటింగ్ ని సాగించేసాడట. సూపర్ స్టార్ రజిని తో కొండలు, గోడలు అన్ని ఎక్కించేసాడట. వివిధ సాహసాలసి చేయించాడు ఈ బేర్ గ్రిల్స్. ఇతను సోషల్ మీడియా లో చెప్పుకొచ్చాడు వారిద్దరి ఎక్స్పీరియన్స్ని. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రారంభం అవుతుందిట.

 

IHG

 

ఈ సాహసం చేస్తున్న సమయం లో రజిని కాంత్ షూ లేస్ ఊడిపోతే బేర్ కట్టడట. ఏది ఏమైనా ఈ షో మాత్రం ఉల్లి తెర మీద సంచలనం సృష్టిస్తుంది అని నమ్ముతున్నారు  ఈ షో నిర్వాహకులు . మరి కొంత కాలం ఆగక తప్పదు ఈ షో కోసం. 

మరింత సమాచారం తెలుసుకోండి: