తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన కామెడీ ముద్ర వేశారు ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ. ప్రముఖ హాస్య బ్రహ్మ జంద్యాల శిష్యుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన ఈవీవీ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తో ‘చెవిలో పువ్వ’ లాంటి కామెడీ సినిమా తీశారు. కొద్ది కాలం తర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమఖైదీ మూవీ అవకాశమిచ్చారు. ఆ మూవీ విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల ప్రభావంతోనే ఈవీవీ ఎన్నో హాస్యబరిత సినిమాలు తెరకెక్కించారు. అంతే కాదు జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని సినిమాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు వంటి సినిమాలో మంచి విజయం అందుకున్న తర్వాత సీనియర్ నరేష్ తో జంబలకిడి పంబ లాంటి సూపర్ హిట్ తీశారు.  

 

సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ లాంటి ఫ్యామిలీ సినిమాల  తర్వాత ఆమె, తాళి వంటి మహిళా నేపథ్యంలో పలు తీశారు.  స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సినిమా తీశారు.  ఆయన వారసులుగా ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లో హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఆర్యన్ రాజేష్ కొంత కాలం క్రితమే సినిమాల్లో నటించడం మానేశారు.  ఆ మద్య బోయపాటి - రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘వినయ విధేయరామ’ సినిమాలో నటించాడు. టాలీవుడ్ లో అల్లరి నరేష్ కామెడీ హీరోగా సత్తా చాటుతున్నాడు.  

 

గత కొంత కాలంగా ఈ అల్లరోడు నటిస్తున్న సినిమాలు పెద్దగా హిట్ కావడం లేదు.  గతంలో ఈవీవీ సిద్ధం చేసిన ఒక కథను ఆయన సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈవీవీ కథల కారణంగానే అప్పట్లో 'అల్లరి' నరేశ్ వరుస విజయాలను అందుకున్నాడు. అందువల్లనే గతంలో ఈవీవీ రాసుకున్న కథల్లోని ఒక కథను ఎంచుకుని 'అల్లరి' నరేశ్ రంగంలోకి  దిగుతున్నాడని అంటున్నారు. ఈ మూవీకి అల్లరి నరేష్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: