ఇండ‌స్ట్రీలో చాలా మంది సింగ‌ర్స్ ఉంటారు. అయితే ఒకొక్క‌రిది ఒక్కో సీజ‌న్ ఉంటుంది. ఒక్కోసారి అతిత‌క్కువ‌కాలంలోనే ఫేమ‌స్ అయిపోతుంటారు కొంద‌రు. మ‌రి కొంద‌రు ఎన్నో పాట‌లు పాడ‌తారు. ఎన్నో పాట‌లు రాస్తారు. కానీ ఆశించినంత హిట్ కాలేక‌పోతారు. మ‌రి అలాంటి కోవ‌కు చెందిన వాళ్ళ‌లో సిద్ధిశ్రీ‌రామ్ కూడా ఉన్నార‌నే చెప్పాలి. సిద్ధి శ్రీ‌రామ్ ఎప్ప‌టి నుంచో పాట‌లు పాడుతున్నారు. కానీ ఎందుకో త‌న‌కు టైమ్ క‌లిసిరాలేద‌నే చెప్పాలి. శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ప‌ని చేసిన‌ప్పుడ‌కు కూడా ఆయ‌న‌కు అంత పేరు రాలేదు. కానీ మాట‌ల‌మాంత్రికుడితో ప‌ని చేశాక ల‌క్ క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. ఇక గ‌తంలో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఐ మూవీలో రెహ‌మాన్ మ్యూజిక్ లో ఆయ‌న ఒక పాట పాడారు కాని అప్పుడు కూడా ఆయ‌న‌కు అంత క్రేజ్ రాలేదనే చెప్పాలి. 

 

మ‌రీ ఇటీవ‌లె వ‌చ్చిన మాట‌ల మాంత్రికుడు ద‌ర్శ‌క‌త్వంలో అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన చిత్రం `అల‌వైకుంఠ‌పురం`చిత్రంతో ఆయ‌న ఫేమ‌స్ అయ్యారు. ఇక ఇందులో త‌మ‌న్ మ్యూజిక్‌లో పాడిన పాట మంచిహైలెట్‌గా నిలిచింది. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న నిను చూసి ఆగ‌గ‌ల‌నా` అంటూ పాడే పాట సూప‌ర్‌డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇన్నిరోజులు రాని గుర్తింపు ఈ పాట‌తో రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే...ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం స్వ‌రం మాత్ర‌మే వింటూ ఉన్నాం. కానీ ఈ చిత్రంలో ఈ పాట‌లు పాడిన‌వారి స్వ‌రంతోపాటు వారు పాడుతున్నది షూట్ చేసి మ‌రి ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసింది. ఈ చిత్ర బృందం. అది ఈ సినిమాకి బాగా హైలెట్‌గా నిలిచింది. దాంతో ఇందులోని పాట‌లు అవి పాడిన సింగర్స్ బాగా హైలెట్ అయ్యారు అని చాలా మంది మ్యూజిక్ ల‌వ‌ర్స్ భావిస్తున్నారు.

 

 కేవ‌లం ఇప్పుడు లైవ్‌లో చూపించ‌డం వ‌ల్ల సిద్ధి శ్రీ‌రామ్ అంత ఫేమ‌స్ అయ్యాడు అనే వాద‌న వినిపిస్తోంది. అయితే ఇటుదేవిశ్రీ ప్ర‌సాద్‌కి  అటు త‌మ‌న్‌కి కూడా సిద్ధి శ్రీ‌రామ్ పాట‌లు ఖ‌చ్చితంగా  ఉండాల‌ని నిర్మాత‌లు త‌మ త‌ర్వాత చిత్రాల్లో పెట్టాల‌ని  చెబుతున్నార‌ట‌. ఈ సెంటిమెంట్ ప్ర‌తిసారి వ‌ర్క్ అవుట్ అవ్వ‌దు అన్న‌ది కూడా ఒక‌సారి గ‌మ‌నిస్తే బావుంటుంది. ఏదో ఒక‌సారి అంటే ప‌ర్వాలేదు. సిద్ధి శ్రీ‌రామ్ అనేవాడు చాలా మంచి గాయ‌కుడు కాద‌న‌డం లేదు కాని మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో అంత‌కు మించి పాడే సింగ‌ర్స్ కూడా చాలా మందే ఉన్నారు. కాని వారికెందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. ఇక‌ పెంచ‌ల్ దాస్ `దారి చూడు దుమ్ము చూడు భామ` అంటూ ఓ మాస్ సాంగ్ పాడి మంచి హిట్ కొట్టారు. కానీ ఆ త‌ర్వాత‌ చెన్నై తీసుకెళ్ళిన‌ప్పుడు ఆయ‌న‌ మంచి స్టైల్‌గా ఉన్నాడు అనుకున్నారంతా ఆ త‌ర్వాత ఏమ‌యిపోయాడో కూడా ఎవ‌రికి అంతు చిక్క‌లేదు.  రాహుల్ సిప్లిగంజ్ ది  కూడా దాదాపు అదే ప‌రిస్థితి. ఏదో ఒక పాట‌తో హిట్ కొట్టార‌ని వాళ్ళ‌ను ఎక్క‌డికో ఎత్తేస్తారు. త‌ర్వాత వాళ్ళు అంతుచిక్క‌నంతగా మాయ‌మ‌యిపోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: