ప్రపంచం అంతా కరోనా వైరస్ పేరు మారుమోగుతుంది.. ఎక్కడ  చూసినా దీనిపైనే చర్చలు కొనసాగిస్తున్నారు.  ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కరోనా కరోనా అంటూ వార్తలే వస్తున్నాయి.  దేశంలో కరోనా సంఖ్య ఇప్పుడు 206కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) నిర్ధారించింది.   దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మొత్తం కలిపి 30 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వైరస్ బాధితులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 52గా ఉంది. దేశంలో ఇప్పటివరకు 14,376 శాంపిళ్లను సేకరించి 13,486 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎమ్‌ఆర్ తెలిపింది.  కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని బంద్ అయ్యాయి.

 

అంతే కాదు మెగాస్టార్ చిరంజీవినే ఏకంగా తన చిత్రాన్ని వాయిదా వేసినట్లు స్వయంగా ప్రకటించారు. చాలా మంది సినీ ప్రముఖులు షూటింగ్ ఇతర వ్యాపకాలు అన్నీ మానేసి ప్రశాంతంగా ఇంటిపట్టునే ఉంటున్నారు.  దాంతో వేసవిలో పూర్తి అవుతాయనుకుంటున్న చిత్రాలు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా ప్రాణాల కన్నా పెద్ద విషయం కాదనుకుంటున్నారు.. మరోవైపు నిర్మాతలకు పెద్ద నష్టాలు.. కష్టాలు తప్పేలా లేవు అంటున్నారు. ఇటీవల కరోనాను లెక్కచేయకుండా డైరెక్టర్ రాధాకృష్ణ, ప్రభాస్ టీమ్ జార్జియాకు వెళ్లి షూటింగ్ చేసిన విషయం తెలిసిందే.

 

తాజాగా వీరి బాటలోనే  నడుస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఫిదా తర్వాత అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  కరొనను లైట్ గా తీసుకొని సైలెంట్ గా మూవీ షూటింగ్ కనిచేస్తున్నాడు.  ఈ చిత్రం ప్రస్తుతం నిజామాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కానీ కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని  పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. ఎలాగైనా సమ్మార్ లో ఈ సినిమాను విడుదల చెయ్యాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: