గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో సాహెూ మూవీ లో నటించిన శ్రద్దా కపూర్ గుర్తుంది కదా.. ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించిన ఈ అమ్మడు బాలీవుడ్ కమెడియన్, విలన్ శక్తి కపూర్ కూతురు.  ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు, కమెడియన్లు, విలన్ల కొడుకులు, కూతుళ్లు హీరో, హీరోయిన్లు గా పరిచయం అవుతున్నారు.  ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో విలన్, కమెడియన్ గా నటించిన శక్తి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘2013లో విడుదలైన ఆషికి 2 లో గాయని పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను, విమర్శకులను బాగా ఆకట్టుకుంది.

 

ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. ఇలా బాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతుంది.  గత ఏడాది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘సాహూ’ లో నటించింది. అయితే ఈ మూవీ బాలీవుడ్ లో ఈ అమ్మడికి మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవింలో ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యానని అంటుంది. తనకు 16ఏళ్ల వయసులో ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని కానీ అది తాను మిస్ చేసుకున్ననై చెప్పుకొచ్చింది.

 

ఇంతకు ఆ ఛాన్స్ ఏంటంటే .. శ్రద్ద 16 ఏళ్ల వయసులో బాలీవుడ్ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందట. కాకపోతే అప్పుడు తాను టెన్త్ క్లాస్ చదువుతున్నానని.. ఎడ్యూకేషన్ పూర్తయిన తర్వాత కెరీర్ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ ఛాన్స్ ఉపయోగించుకోలేక పోయానని అంటుంది. అయితే ఆ తర్వాత నాకు ఎన్ని  సినిమా అవకాశాలు వచ్చినా..సల్మాన్‌తో కలిసి నటించే అవకాశం వదులుకున్నానని ఇప్పటికీ బాధపడుతుంటానని చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: