తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోలు గా ఉన్న వాళ్ళలో ప్రధానంగా చెప్పుకునేది,  మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ,అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీళ్ళ సినిమాలు అనగానే ఒకప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. అయితే ఆ క్రేజ్ ఇప్పుడు క్రమంగా పడిపోతుంది అనే భావన టాలీవుడ్ లో వినపడుతోంది. దానికి కారణం ప్రేక్షకుల ఆదరణ లేకపోవడం అనేది సినీ జనాల మాట .ఒకప్పుడు చిరంజీవి సినిమా విడుదల అవుతుంది అంటే పనులు మానుకుని మరీ చూసే వాళ్ళు కొందరు.

 

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన సినిమాలు కూడా ఒక సాధారణ హీరో సినిమాలు మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు. సైరా సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి పని అయిపోయింది అనే టాక్ కూడా టాలీవుడ్ వర్గాలలో వినపడుతుంది. అందుకే మెగా ఫ్యాన్స్ కూడా ఆయన సినిమా విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదని, ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కు అంత క్రేజ్ లేదని అంటున్నారు. ఇక అక్కినేని నాగార్జున విషయానికొస్తే ఆయన దాదాపు సినిమాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు.

 

ఎప్పుడో ఒక సినిమా మినహా నాగార్జున పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఏదో ఒకటి, రెండు సినిమాల్లో ఏడాదికో ,రెండేళ్ళకో అలా కనిపించి ఇలా వెళ్ళిపోతున్నారు నాగార్జున. ఇక బాలకృష్ణ విషయానికొస్తే ఆయన సినిమాలు అంటే ఒకప్పుడు బాలయ్య ఫాన్స్ అటు నందమూరి ఫ్యాన్స్ ఎక్కువగా హడావుడి చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనబడటం లేదని చెప్పాలి. యువ హీరోలకు పోటీ పెరగటం కమర్షియల్ సినిమాల హవా ఎక్కువ కావడంతో ఒకప్పుడు స్టార్ హీరో గా ఒకవెలిగిన వాళ్ళు ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వెంకటేష్ సినిమాలు పర్వాలేదనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: