సినీ పరిశ్రమలో అవకాశాల కోసం చాలా మంది హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్క సినిమా హిట్టయితే తమ దశ తిరిగిపోతుంది అనే భావన చాలా మంది హీరోయిన్ లకు ఉంటుంది. తమ ఉద్యోగ అవకాశాలను కూడా వదిలేసి వెండితెరమీద పరిచయం అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా ఎవరూ హిట్ అవ్వడం లేదు. అంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిల విషయంలో కొందరు అగ్ర దర్శకులు గా చెప్పుకునే వాళ్ళు కొందరు స్టార్ హీరోలను గా చెప్పుకునే వాళ్ళు ,అగ్ర నిర్మాత గా చలామణి అయ్యే వాళ్లు కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

 

అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిలను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు డిమాండ్ లు పెట్టడం నచ్చితేనే సినిమా చేయాలి అన్నట్టు దురుసు సమాధానంతో హీరోయిన్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారట. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి అదేవిధంగా ఉత్తరాది నుంచి కొందరు అమ్మాయిల తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఒక స్టార్ నిర్మాత వద్దకు వెళ్లగా వారిని బాగా ఇబ్బంది పెట్టారని దీంతో భయపడిన ఇద్దరు అమ్మాయిలు తెలుగు సినీ పరిశ్రమ వైపు చూడటానికి కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

 

రెమ్యూనరేషన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తక్కువగా ఉండటం అదేవిధంగా లిప్ లాక్ సీన్లు బికినీ లో చేయటం సాంగ్స్ చేయాలని చెప్పటంతో కొంతమంది హీరోయిన్లు అసలు ఎందుకు హైదరాబాద్ అని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇటీవల ఒక హీరోయిన్ బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నం చేయగా ఆమెకు అక్కడ అవకాశాలు దొరికాయని ఆ సమాచారం. ఏది ఎలా ఉన్నా కొందరు దర్శకనిర్మాతలు కొందరు హీరోలు అనుసరిస్తున్న వైఖరి మాత్రం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: