జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. రాజకీయాలను పక్కనబెట్టి సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేసారు. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది .ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 

ఇది పక్కన పెడితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు ఆయన క్రిష్ సినిమా మీద దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని మీద చిత్ర యూనిట్ ఎక్కువగా కసరత్తులు చేస్తోంది. ఈ సినిమా లో హీరోయిన్ గా సమంతను తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది చిత్ర యూనిట్. ప్రస్తుతం సమంత ఆఫర్ లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.

 

ఆమెకు అవకాశాలు ఇవ్వటానికి దర్శకులెవరు ముందుకు రావటం లేదు. సినిమాలు చేయాలి అనే ఆసక్తి ఉన్నా ఆమెకు అవకాశాలు రావడం లేదనే టాక్ ఎక్కువగా వినపడుతోంది. ఈ తరుణంలోనే దర్శకుడు క్రిష్ ,పవన్ కళ్యాణ్ ఆమెను సినిమాలు చేయాలని కోరినట్లు సమాచారం. పారితోషికం అటు ఇటు అయినా సరే ఆమె చేయడానికి రెడీ అంటోంది. కాగా ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.  వకీల్ సాబ్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: