మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే తన సినీ కెరియర్ పునఃప్రారంభించాడో అప్పటినుండి కుర్ర హీరోల కంటే వేగంగా దూసుకెళ్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా తీసిన కొన్ని సంవత్సరాలలోనే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించాడు ఈయన. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్లీ ఇంకొక సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ 50 శాతం పూర్తికాగా... కరోనా వైరస్ వలన మిగతా షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేయడం జరిగింది.



ఐతే మార్చి 31 వరకు షూటింగ్ కార్యక్రమాలు నిలిపివేయడంతో చిరంజీవికి విశ్రాంతి దొరికింది. ఈ విశ్రాంతి సమయంలో కూడా చిరంజీవి ఇంకో సినిమా చేయాలనే ఉద్దేశంతో... కథలను వింటున్నాడు. అయితే ఈ దశలోనే జైలవకుశ తెరకెక్కించిన డైరెక్టర్ కె.ఎస్ రవీంద్ర(బాబి) స్క్రిప్ట్ ని చిరంజీవి విన్నాడని... ఆపై ఆ స్క్రిప్ట్ ఆయనకి బాగా నచ్చిందని విశ్వసనీయ వర్గాల నుండి టాక్. బాబీ తో తన తదుపరి చిత్రాన్ని తీసేందుకే చిరు నిశ్చయించుకొని మరీ బౌండెడ్ స్క్రిప్టు కూడా సిద్ధం చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.




కుర్ర డైరెక్టర్ బాబీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీమామ సినిమాతో కూడా బాగానే అలరించాడు. 2016 సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి కూడా ఇతనే దర్శకుడు. అయితే తన తమ్ముడు చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి బాబీ యొక్క దర్శకత్వ ప్రతిభను అప్పట్లో తెగ మెచ్చుకున్నారు. ఆ నమ్మకంతోనే ప్రస్తుతం అతని కథని విని ఓకే చేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య' కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత కొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అన్నీ సానుకూలంగా ఉంటే ఆ వెంటనే బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ చిత్ర షూటింగ్ లో చిరంజీవి బిజీ అయిపోతారు అని తెలుస్తోంది. ఏదేమైనా సైరా నరసింహారెడ్డి ఆశించినంత డబ్బులు వసూలు లేకపోయేసరికి ఒక హిట్ కొట్టి నష్టాన్ని భర్తీ చేయాలని చిరంజీవి అనుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: