భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు.  ఒక సామాన్య బస్ కండెక్టర్ నుంచి  ప్రపంచ స్థాయి మెచ్చే హీరో అయ్యారు.  రజినీకాంత్ ది ప్రతీ ఒక్కటీ స్టైలే.. ఆయన అడుగు వేసినా.. కాలర్ పైకెత్తినా.. జుట్టు పైకి దువ్వినా.. సిగరేట్ గాల్లో ఎగరేసి నోట్లో వేసుకోవడం ఇలా ప్రతి ఒక్కటీ స్టైల్.  సినీ ఇండస్ట్రీలో స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.  ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు.   నీళ్లు లేని నరకం వంటి ఎడారులు, కాకులు దూరని కారడవులు, మంచు తప్ప ఏమీ కనిపించని అతిశీతల ప్రాంతాలు.. ఇలా ఎక్కడైనా మనుగడ సాగించగలనని నిరూపించడం బేర్ గ్రిల్స్ కే చెల్లుతుంది.

 

ఈ కార్యక్రమం డిస్కవరీ చానల్లో మార్చి 23న రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం రజనీకాంత్, బేర్ గ్రిల్స్ జోడీ కర్ణాటకలోని బండిపుర అరణ్యాలకు వెళ్లింది. తాజాగా, దీనికి సంబంధించిన స్నీక్ పీక్ మూమెంట్స్ వీడియోను విడుదల చేశారు.  ఈ వీడియోలో రజినీ కాంత్ ని చూస్తుంటే నిజంగా ఇంత హుషారు ఎక్కడ నుంచి వచ్చిందా అన్నంతగా ఆశ్చర్యపోతారు. బేర్ గ్రిల్స్ సమానంగా రజినీ చేస్తున్న ఫీట్స్ చూస్తుంటే షాక్ తింటారు.   ఓ వంతెన ఇనుప రెయిలింగ్ పై రజనీ, బేర్ గ్రిల్స్ నడవడం సినిమా స్టంట్ కు తీసిపోని విధంగా ఉంది.

 

కాగా, సినిమాల్లోకి రాకముందు మీరేం చేసేవారు? అని బేర్ గ్రిల్స్ ప్రశ్నించగా, 'బస్ కండక్టర్' అని రజనీకాంత్ జవాబు చెప్పారు. దాంతో బేర్ గ్రిల్స్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.  అయితే తన పేరు ఇండస్ట్రీలో రజినీ కాంత్ అని.. ఇంటికి వెళితే..  శివాజీరావ్ గైక్వాడ్ నని తెలిపారు. తన స్నేహితులకు కూడా ఇదే పేరుతోనే పిలుస్తారని అన్నారు.  షూటింగ్ తర్వాత రజనీ అనే పేరును మర్చిపోతానని వివరించారు. అంతేకాదు, ఇలాంటి సాహసాలను తన జీవితంలో ఎన్నడూ చేయలేదని రజనీకాంత్ విస్మయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: