ఎనిమేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన అత్యంత దారుణమైన ఘ్టన యావత భారతదేశాన్ని కలవరపరిచి కంటతడి పెట్టించింది. ఆ రోజు జరిగిన 'నిర్భయ' ఘటనకు ఈరోజు న్యాయం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా ఎన్నో అడ్డంకులతో ఎంత మాత్రం ముందుకు కదలని నిర్భయ కేసు అనూహ్యంగా ఈరోజు దోషులను ఉరి తీయడంతో దేశ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్భయ రేప్ ఘటన తర్వాత కూడా ఇలాంటి ఎన్నో అతి దారుణమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

 

మరి నిర్భయ ఘటనకు న్యాయం జరగడానికే ఎనిమిదేళ్లు పట్టింది. అలాంటప్పుడు మిగిలిన కేసులకు ఎప్పుడు న్యాయం జరుగనుందో.. అసలు న్యాయం జరుగుతుందో లేదో తెలియదని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్షపై ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు కూడా వారి అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు.

 

అయితే అందరు మర్చిపోయిన తర్వాత న్యాయం జరిగితే ఏం లాభమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు ఇన్నాళ్ళకైనా న్యాయం జరిగింది కాదా అని తమ కి తామే సమర్ధించుకుంటున్నారు. అయితే ఈ ఉరిశిక్ష పై సౌత్ ఇండియన్ హీరో కార్తీ కూడా స్పందించాడు. 'నిర్భయ కేసుకే సగం దేశం మర్చిపోయాక న్యాయం జరిగితే మరి రోజురోజుకు ఎన్నో  కేసులు నమోదవుతున్నాయి. మరి ఆ కేసులన్నిటికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది. ఇలాంటి ఘటనే పొల్లాచిలో 16యేళ్ల బాలికకి జరిగింది.

 

ఇది జరిగి కూడా సంవత్సరం అయిపోయింది. ఈ కేసుకు ఎన్ని సంవత్సరాలకు న్యాయం జరుగుతుందో .. అంటూ స్పందించారు. అత్యంత దారుణమైన ఘటన పరిష్కారం కావడానికి ఇన్నేళ్ల సమయం పడుతుంటే రోజులో వారంలో నెలలో సంవత్సరంలో జరుగుతున్న ఈ దారుణాలకి అమాయకులైన ఆడ పిల్లలకి ఎంతకాలానికి న్యాయం జరుగుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు కోలీవుడ్ హీరో కార్తి.

 

ఏదేమైనా మొన్న దిశ .. నేడు నిర్భయ నిందుతులకి తగిన శాస్తి జరగడం మాత్రం హర్షించదగ్గ విషయం. ఈ రెండు ఘటనల కి పోలీసులు, న్యాయస్థానం తీసుకున్న సంచలనమైన నిర్ణయాలు కీచకుల గుండెల్లో గుణపాలు దింపాయి. మరి ఇప్పటి నుంచైనా ఇలాంటి ఘటనలకి పాల్పడకుండా ఉంటే నిర్భయ, దిశ లాంటి ఆడపిల్లలు సమాజంలో మరొకరు బలికాకుండా ఉంటారు. అయితే కార్తి చేసిన వ్యాఖ్యలకి మాత్రం నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: