సినిమా ఇండ‌స్ట్రీ అంటే అదో రంగుల ప్ర‌పంచం ఇక్క‌డ ప్ర‌తి ఒక్క‌రు ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఆరాట‌ప‌డ‌తారు. సినిమాల్లోకి వ‌చ్చి స్టార్లు అవ్వాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంటారు. ఒక్క‌ఛాన్స్ అంటూ దేనికైనా రెఢీ అంటారు. అలా వ‌చ్చి తెలుగు సినిమాల్లో ఏలిన‌వారు చాలా మందే ఉన్నారు. కాని సినిమాల కోసం జీవించి సినిమాలతోనే అంత‌మైన‌వారు కొంత‌మందే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ముగ్గురు. తెలుగు చిత్ర సీమ‌లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందిన సావిత్రి, సౌంద‌ర్య‌, శ్రీ‌దేవి. మ‌రి వీరి మ‌ర‌ణంలోనూ ఓ సాపేక్షి కార‌ణం ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

వెండితెర పై మ‌హాన‌టిగా వెలుగొందిన సావిత్రి త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం ఓడిపోయింది. సినిమాల్లో ధృవ‌తార‌గా మేలిన‌టిగా అల‌రించినా భ‌ర్త‌తో మాత్రం విభేదాలు అన‌వ‌స‌రంగా అంద‌రిని న‌మ్మి ఆస్తుల‌ను కోల్పోయి చివ‌రికి దిక్కుతోచ‌ని స్థితిలో త‌నువు చాలించింది. సావిత్రి సినిమాల్లోకి వ‌చ్చాక ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను సాధించింది. కాని రెండో పెళ్ళివాడైన జెమిని గ‌ణేష‌న్‌ని పెళ్ళి చేసుకున్నాకే సావిత్రి ప‌త‌నం మొద‌ల‌యింది. జెమినికి ఉన్న అమ్మాయిల పిచ్చి సావిత్రికి తెలియ‌డం ఆ త‌ర్వాత జెమినికి దూరంగా ఉండ‌డం ఆయ‌న పై కోపంతో సినిమాలు తీసి ఆర్ధికంగా ఎంతో న‌ష్ట‌పోయింది. దాన‌ధ‌ర్మాలు చేసి  ఆస్తి అంతా ఇన్‌క‌మ్‌ట్యాక్స్‌కి పోయి చివ‌రికి దిక్కు దివానం లేక బంధువులంతా ఆస్తులు లాక్కుని మోసం చేయ‌టంతో మ‌ధ్యానికి బానిసై చ‌నిపోయింది. సినిమాల పై ఎంతో ఆశ‌క్తిగా వ‌చ్చిన సావిత్రి కేవ‌లం భ‌ర్త వ‌ల్లే ఇంత ప‌త‌న‌మైంది అంటే అది అతిశ‌యోక్తి కాదు. 

 

ఇక తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మేటి న‌టిగా దాదాపు ప‌దేళ్ళు కొన‌సాగింది సౌంద‌ర్య‌. తెలుగులో అగ్ర‌హీరోలంద‌రితో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించింది. కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా న‌టించింది. క‌ర్నాట‌క‌ చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ని పెళ్ళిచేసుకుంది. అయితే సౌంద‌ర్య ఆస్తి విష‌యంలో త‌గాదాలు వ‌చ్చియి. ఆమె ఆస్తి విష‌యంలో పుట్టింటివారు, భ‌ర్త‌కి విభేదాలు వ‌చ్చి కొట్టుకున్నారు. ఆస్తి కోసం కోర్టు చుట్టూ తిరిగారు. ఈ క్ర‌మంలోనే కాస్త ఆర్ధిక ఇబ్బందుల‌ను కూడా ఎదుర్కొంది సౌంద‌ర్య దాంతో రాజ‌కియాల వైపు అడుగువేసింది. ఈ క్ర‌మంలోనే బెంగుళూర్ నుంచి బిజెపి త‌ర‌పున క్యాంపెనింగ్ కోసం విమానంలో వ‌స్తూ మ‌ధ్య‌లో విమానం కూలి మ‌ర‌ణించింది. సౌంద‌ర్య మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ఆమె ఆస్తి గొడ‌వ‌లు భ‌ర్త, పుట్టింటివారికి గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే సౌంద‌ర్య భ‌ర్త వైఖ‌రే ఆమెను రాజ‌కియాల వైపు అడుగులు వేయించిందని అందుకే ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోయింద‌న్న వివాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా సౌంద‌ర్య మ‌ర‌ణానికి కూడా ప‌రోక్షంగా భ‌ర్తే కార‌ణంగా తెలుస్తుంది. 

 

అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి ద‌క్షిణ‌భార‌త‌దేశంలోని అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించింది. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ నుంచి తెలుగులో చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ మ‌ల‌యాళంతో పాటు హిందీలో కూడా అగ్ర‌క‌ధానాయ‌కులు స‌ర‌స‌న న‌టించి దేశంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా పేరుగాంచింది. కాని ఆమె కూడా కుటుంబ గొడ‌వ‌ల‌తో త‌నువు చాలించింది. అప్ప‌టికే పెళ్ళై పిల్ల‌లు ఉన్న బోనీక‌పూర్‌ని చేసుకుని శ్రీ‌దేవి పెద్ద త‌ప్పే చేసింది. శ్రీ‌దేవి త‌న ఆస్తుల‌న్నిటిని అప‌హ‌రం చేయ‌డం అలాగే త‌న ఆస్తుల‌ను మొద‌టి భార్య పిల్ల‌ల‌కు కూడా ఇవ్వ‌డం కూతుర్ల భ‌విష్య‌త్తు పై శ్రీ‌దేవి మాన‌సికంగా కృంగి దుబాయ్‌లో అపార‌క స్థితిలో వెళ్లి మ‌ర‌ణించింది. శ్రీ‌దేవి, సౌంద‌ర్య‌, సావిత్రి వీరి మ‌ర‌ణాల‌కి ప‌రోక్షంగా వారి భ‌ర్త‌లే కార‌ణం అని అర్ధ‌మ‌వుతోంది. అంతుచిక్క‌ని వీరి మ‌ర‌ణాలు సినిమాలోని ఎత్తుప‌ల్లాల‌ను సూచిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: