సినీ పరిశ్రమలో కొందరు స్టార్ హీరోలు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూనే వ్యాపారలలోను అడుగు పెడుతుంటారు. కొంతమంది అక్కడ కూడా సక్సస్ అవుతుంటారు. ఇక కొంతమంది హీరోలు సినిమాలోనే వాటా తీసుకుంటూ కొత్త పంథాలో సాగుతున్నారు. అందుకే చాలామంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు నిర్మాతలుగా మారి మంచి కథా చిత్రాలను నిర్మించి సక్సస్ అయ్యారు. ఇప్పుడు మన స్టార్ హీరోలు తమ పంథా మార్చుకుంటున్నారు. వాళ్ళు నటించే ప్రతి సినిమా నిర్మాణంలో భాగస్వాములు కావాలని అనుకుంటున్నారు. 

 

ఎప్పటి నుంచో స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు గత కొంతకాలంగా సినిమా రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ ని అందుకుంటున్న సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు హిట్ ఫ్లాప్ అన్న ఫీడ్ బ్యాక్ ఎప్పుడొచ్చినా స్టార్ హీరోల సినిమాలకి ఫస్ట్ వీక్ లోనే రిటర్న్ వచ్చేస్తాయి. అలా వస్తున్నాయి కాబట్టే పెట్టుబడికి లాభం కలుపుకొని సినిమా నిర్మాతలు ముందే అమ్మేసుకుంటారు.

 

ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. స్టార్ హీరోతో సినిమా అంటే లాభాలు గ్యారంటీ. ఈ లాజిక్ తెలుసుకునే స్టార్ హీరోలు కూడా వచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు అక్కినేని నాగార్జున..ఆయన నటించే ప్రతి సినిమాలో భాగస్వామిగా ఉంటూ చిత్ర లాభ నష్టాలలో తను కూడా ఒక బాగమయ్యోవారు. నాగార్జున ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇక మహేష్, ప్రభాస్ కూడా ఇప్పుడు రెమ్యూనరేషన్ కాకుండా షేర్ తీసుకుంటున్నారు.

 

ఇప్పుడు వీళ్ళ రూట్ లోకి యం టైగర్ ఎన్టీఆర్ కూడా వచ్చి చేరారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న తారక్ నెక్స్ట్ త్రివిక్రం తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవ్వాలనుకుంటున్నాడట. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ త్వరలో ఓ నిర్మాణ సంస్థను స్థాపించే దిశగా సన్నాహాలు చేస్తున్నాడట. ఆయన సొంత బ్యానర్ లో నిర్మించే సినిమాల కోసం ఇప్పటి నుంచే కథలని వింటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: