రామ్ గోపాల్ వర్మ అంటే ఒక పుస్తకం. ఆ పుస్తకం అంత సులభంగా అర్థం కాదు. అయితే మాత్రం ఒక్కో పేజీలో ఒక్కో గొప్ప విషయం ఉంటుంది. శివ సినిమా తో ప్రయాణం మొదలు పెట్టిన వర్మ ఎన్నో అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. సౌత్ నుండి వెళ్లిన వర్మ బాలీవుడ్ లో టాప్ స్టార్ డైరెక్టర్ గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఏలాడు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చి కెరీర్ ఇంకో లెవెల్ కి తీసుకు వెళ్ళిన దర్శకుడు వర్మ అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అలాంటి వర్మ కొంత కాలంగా చెత్త సినిమాలు  తీస్తున్నాడు. ఒక్కో సినిమా డిజాస్టర్ కా బాప్ అన్న టాక్ ని తెచ్చుకుంటున్నాయి.

 

అయితే ఈ డిజాస్టర్స్ ని తట్టుకోలేక హీరోయిన్ ఇషా కొప్పికర్ రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ కెరీర్ ఏమవుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆయన హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. ఆయన చేసిన ప్రతి సినిమాను చూశాను. యాక్షన్.. రొమాన్స్.. హర్రర్ ఇలా అన్ని జోనర్ లలో తీసిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అలాంటిది రెండు మూడేళ్ళు గా వర్మ తీసిన సినిమాలు దారుణంగా ఫ్లాపవుతున్నాయి అంటూ వాపోతుంది.

 

ప్రస్తుతం వర్మకు బ్యాడ్ టైం నడుస్తోందని... త్వరలోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి వరుసగా బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఈ బ్యూటీ ధీమాగా వెల్లడించింది. ఇక వర్మ తెరకెక్కిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో ఈ బ్యూటి కీలక పాత్రలో నటిస్తోంది. నటనకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న ఇషా కొప్పికర్ వర్మ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. ఈ వెబ్ సిరీస్ అద్బుతంగా ఉందని..చాలా కాలానికి వర్మ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందంటూ ఇషా కొప్పికర్ సంబరపడుతూ చెప్పింది. ఇక వర్మ కెరీర్ గురించి ఈ బ్యూటి ఆవేదన వ్యక్తం చేయడంతో ఇషా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఆయనేమైనా నిన్నా మొన్నా ఇండస్ట్రీకి వచ్చాడా లేక రెండు మూడు సినిమాలు తీశాడా ఆయన గురించి నువ్వంతగా ఫీలవ్వాల్సిన పనిలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: