మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి ని ఫాలో అవడం ఎవరి తరం కాదు. సినిమా కథ విషయంలో అయినా, పాటలకి సాహిత్యం విషయం లోనైనా ఇక ఆయన స్వతాహాగా రాసే మాటల విషయంలోనైనా ఆయనకి ఆయనే సాటే. అయితే గురూజికి ఒకసారి ఎవరైనా ట్యూన్ అయితే వాళ్ళని అంత ఈజీగా వదలరు. అందుకు ఉదాహరణ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. ఆయనే కాదు ఆయన తో చేస్తున్న హీరోయిన్స్ అయినా అంతే. జల్సా సినిమాకి ట్యూన్ అయిన దేవీ సన్నాఫ్ సత్యమూర్తి వరకు త్రివిక్రమ్ తో సక్సస్ ఫుల్ జర్నీ చేశారు. ఇద్దరి కాంబినేషన్ లో అద్భుతమైన ఆల్బంస్ వచ్చాయి. 

 

అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో గాని త్రివిక్రమ్ దేవీశ్రీ ని వదిలేశారు. థమన్ తో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తారక్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ సినిమాకి థమన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా సక్సస్ అయింది. దాంతో మళ్ళీ ఇద్దరు కలిసి 'అల వైకుంఠపురంలో' సినిమాకి పని చేశారు. ఈ సినిమా మ్యూజిక్ .. అల హిట్ అవడానికి ప్రధాన పాత్ర వహించింది. ఇంకా చెప్పాలంటే సగం క్రెడిట్ థమన్ కే ఇవ్వాలి. అందుకే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టరుగా థమన్ ని తీసుకోవాలనుకుంటున్నారట.

 

థమన్ గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస వంటి సినిమాలకు సంగీతం అందించాడు. ఇక వీరి ముగ్గురి కలయికలో వచ్చిన 'అరవిందసమేత వీర రాఘవ' సినిమా మంచి హిట్ ని అందుకున్నారు. అందుకే మరో సారి ఈ ముగ్గురు కలిసి మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇక థమన్ ప్రస్తుతం టాలీవుడ్  మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ కి కూడా థమన్ సంగీతమందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: