మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో నాని , సుధీర్ బాబు నటించిన మల్టీ స్టారర్ చిత్రం వి. ఈ చిత్రం ఉగాది కానుకగా  ఈ నెల 25న విడుదలకావాల్సి వుంది కానీ కరోనా వైరస్ ఆ విడుదలను అడ్డుకుంది. ప్రస్తుతం కరోనా వల్ల  తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 31 వరకు థియేటర్లను మూసివేసిన విషయం తెలిసిందే దాంతో వి విడుదలఆగిపోయింది. అన్ని కుదిరితే ఏప్రిల్ లో ఈసినిమా విడుదలకానుంది.
 
ఇటీవల విడుదలైన వి టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమాలో ప్రీ క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్టులు హైలైట్ కానున్నాయని సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి సీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించనుండగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. కాగా నాని కి ఇది 25వ సినిమా కావడం విశేషం. ఇక  గత ఏడాది గ్యాంగ్ లీడర్ తో దెబ్బ తిన్న నానివి పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 
 
ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం తనకు నిన్నుకోరితో హిట్ ఇచ్చిన శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈచిత్రంలో నాని మిడిల్ క్లాస్ అబ్బాయి గా కొత్త లుక్ లో కనిపించనుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు , నాని కి అన్నయ్యగా అలాగే రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. జులై లో ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: