ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వైరస్ వణికిస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఇటలీ దేశంలో అనేక మందిని బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారు రెండు లక్షల కంటే ఎక్కువగానే ఉన్నారు. ఇండియాలో కూడా 20 రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ ప్రభావం ఎక్కువ అవుతున్న తరుణంలో రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు వ్యాపార సంస్థలతో పాటు విడుదల కావాల్సిన సినిమాలు నిలిపి వేయడం జరిగింది.

 

 

 

ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం పైన కాకుండా సినిమా ఇండస్ట్రీ పై విపరీతమైన ప్రభావాన్ని ఈ కరోనా వైరస్ చూపించింది. మార్చి 31 వరకు విడుదల తేదీలు ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని బాగా ఇస్తున్నారు కానీ అప్పటికీ సరైన మెడిసిన్ దొరకకపోతే మాత్రం ఈ బంద్ పొడిగించే అవకాశం ఉన్నట్లు దేశ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. గుంపులు గుంపులుగా ప్రజలు ఉండకూడదని ప్రభుత్వాలు తెలపడంతో ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమాలకి ఊహించని ట్విస్ట్ కరోనా వైరస్ ఇచ్చింది.

 

 

 

ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమాల ప్రమోషన్లు కచ్చితంగా జరగదు కాబట్టి రిలీజ్ అయ్యే సినిమాలకు పెద్దగా లాభం ఏమీ ఉండదని ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. మరోపక్క సినిమా స్టార్లు కూడా ఇల్లు వదిలి బయటకు రాకపోవడం తో ఇండస్ట్రీలో సినిమా నిర్మాతల పరిస్థితి గందరగోళంగా తయారైంది. మొత్తం మీద పరిస్థితి చూస్తే వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలకు భారీగానే దెబ్బ వేసింది కరోనా వైరస్.

మరింత సమాచారం తెలుసుకోండి: