మలయాళ 'ప్రేమమ్' సినిమాతో అనుపమ పరమేశ్వరన్ అదిరిపోయే పేరు సంపాదించింది. ఆ సినిమాతో తన అందంతో పాటు తన నటన తో ఎంతో ఎట్రాక్ట్ చేసింది. మలయాళ ప్రేమమ్ సినిమా విజయంతో సౌత్ లోనే ఓ వెలుగు వెలిగింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాల అవకాశాలు దక్కించుకుంది అనుపమ పరమేశ్వరన్. తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీ లో హీరోయిన్ గా నటించిన అనుపమ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సరసన 'అ ఆ' సినిమాలోనూ నటించింది. అదేవిధంగా శర్వానంద్ నటించిన శతమానం భవతి, రామ్ పోతినేని నటించిన ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలలో హీరోల పక్కన హీరోయిన్ ఛాన్సులు పండుకుంది అనుపమ.

 

ఈ సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న అనుపమ, మొన్నటి వరకు కొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ అయింది. అయితే ఈ మధ్య కొంచెం చాలా పెద్ద గాప్  తీసుకోవటంతో రేసులో వెనకబడిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. సినిమాల పరంగా క్రేజ్ తగ్గింది కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకి క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. సోషల్ మీడియాలో కొన్ని ఎకౌంట్ లో దాదాపు ఆరు మిల్లియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

 

ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు పోస్ట్ చేస్తుందా ఫోటో అంటూ కాచుకొని కూర్చుని ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. తన అదిరిపోయే కళ్ళతో రింగులు రింగులు జుట్టుతో కుర్రకారు హృదయాలను గెలుచుకునే విధంగా హాట్ హాట్ అందాలతో చెట్టుకు ఆనుకొని ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అదిరిపోయే లైక్ లు అందుకుంది. కచ్చితంగా ఈ ఫోటో దెబ్బకి గ్యారెంటీగా అనుపమ పరమేశ్వరన్ కి ఆఫర్లు వస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: