బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ మెగా నందమూరి మల్టీ స్టారర్ సినిమా ఇద్దరు రియల్ హీరోస్ పాత్రలతో కల్పిత కథతో తెరకెక్కుతుంది. సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అలియా భట్, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. 

 

అసలైతే rrr ఈ ఇయర్ జూలై 30న రిలీజ్ కావాల్సి ఉన్నా షూటింగ్ అనుకున్న టైమ్ కి జరగక పోవడంతో రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చింది. 2021 జనవరి 8న ట్రిపుల్ ఆర్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి కూడా సినిమా రావడం కష్టమని అంటున్నారు. సినిమా  70 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నా ఇంకా అలియా భట్ సీన్స్ షూట్ చేయలేదట. అందుకే గత రెండురోజులుగా అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ నుండి బయటకు వెళ్ళింది అన్న వార్తలు వస్తున్నాయి. 

 

ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. రాజమౌళి సినిమా షూటింగ్ ఎన్ని రోజులు పడుతుందో గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని రోజులు పడుతుంది. అందుకే 2021 జనవరిలో కూడా rrr రావడం కష్టమే అంటున్నారు. అయితే అఫీషియల్ గా చెప్పే వరకు ఈ వార్తలు నమ్మలేం. ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆర్.ఆర్. ఆర్ మరో బాహుబలి కాదు అంతకుమించి సినిమా అవుతుందని చెప్పొచ్చు. అందుకే రాజమౌళి ఏమాత్రం తొందర పడకుండా ఈ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్, చరణ్ లు కూడా సినిమా రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని జక్కన్నని ఫాలో అవుతున్నారట. సినిమా మాత్రం మరో అద్భుత కళాకండంలా ఉంటుందని మాత్రం చెబుతున్నారు. ఇద్దరు హీరోలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడి మరి నటించారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: