టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే పలు షూటింగ్స్ వాయిదా వేసుకుంటున్నారు.  మరికొన్ని సినిమాలు సైతం వాయిదా వేస్తున్నారు.  ఈ నేపథ్యంలో కొరటాల-చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ మూవీ పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే.  మళ్లీ షూటింగ్ ఎప్పుడు అన్నది తెలియాలి.  అయితే ఈ మూవీలో మెగాస్టార్ ఎండోమెంట్ అధికారిగా, న‌క్స‌లైట్‌గా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌క్సలైట్ ఉద్య‌మం నేప‌థ్యంలో ఈ మూవీని కొర‌టాల తెర‌కెక్కిస్తున్న‌ట్టు చెబుతున్నారు. దేవాలయాల మాఫియాపై ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.  

 

అయితే ఈ మూవీలో మెగాస్టార్ స్టూడెంట్ గా ఉన్నపుడు నక్సల్ గా కనిపిస్తారని.. అతని సహచరుడిగా ఉద్యమ నేతగా మహేష్ బాబు నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  కానీ  రెమ్యున‌రేష‌న్ స‌మ‌స్య కార‌ణంగా ఈ మూవీ నుంచి మ‌హేష్ త‌ప్పుకోవ‌డంతో మ‌ళ్లీ సీన్‌లోకి మళ్లీ రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది.  వాస్తవాానికి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు. ఈ కారణంతో ఆయన వేరే సినిమాల్లో నటించే పరిస్థితి లేదని అప్పట్లో వార్తలు వినిపించాయి.  ఇక సినిమాలో 30 నిమిషాల నిడివితో సాగే స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర కోసం ముందు రామ్‌చ‌ర‌ణ్‌ని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే చ‌ర‌ణ్‌తో షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని కొర‌టాల శివ డిసైడ్ అయ్యార‌ట‌. 

 

తాజా ప‌రిస్థితి క‌రోనా కార‌ణంగా అదుపు త‌ప్పుతుండ‌టంతో షూటింగ్‌ని వాయిదా వేశారు. మరి ఈ విషయంలో రాజమౌళిని ఒప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  అన్నీ అనుకూలంగా ఉంటే  రామ్‌చ‌ర‌ణ్ కు సంబంధించిన షూటింగ్‌ని మొద‌లుపెట్టాల‌నుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే టీమ్ అంతా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. మరి ఈ మూవీలో తండ్రి కొడుకులు ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.  కాకపోతే ఒకేసారి తెరపై చిరంజీవి, చరణ్ కనిపించకపోవొచ్చు అని అంటున్నారు.  ఈ మూవీలో మొదట త్రిష అనుకున్నప్పటికీ ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: